నగరంలో డెంగీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ ఈ సీజన్‌లో గతేడాది కన్నా తక్కువగానే నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: నగరంలో డెంగీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ ఈ సీజన్‌లో గతేడాది కన్నా తక్కువగానే నమోదు అయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 22 వరకూ 781 డెంగీ కేసులు నమోదు అయ్యాయని మున్సిపల్ అధికారులు సోమవారం తెలిపారు. నగర వ్యాప్తంగా మొత్తం 725 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 171, పశ్చిమం 320, తూర్పు 141, న్యూఢిల్లీ 19 కే సులు నమోదు అయ్యాయి. మిగతా 56 కేసులు ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల పరిధిలో నమోదు అయ్యాయి. శ్రీనగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల రిషీ క్వాడాఫీ సెప్టెంబర్ 28వ తేదీన సర్ గంగారామ్ ఆస్పత్రిలో మృతి చెందింది.
ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకూ నగరంలో ఇద్దరు డెంగీ బాధితులు మాత్రమే మృతిచెందారు. దివాళీ పండు గ నుంచి డెంగీ కేసుల నమోదు తగ్గిపోయిందని చెప్పారు. అయితే ప్రస్తు తం డెంగీ దోమలు వృద్ధిచెందడానికి నగరవాతావరణం అనుకూలంగా మారిందని, పలువురు డెంగీ బారిన పడుతున్నారని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఈఏడాది ఎక్కువ కేసులు నమోదు అయినప్పటికీ ఇదే సీజన్‌లో గతేడాదికన్నా తక్కువే నమోదు అయ్యాయి. అప్పట్లో మొత్తం 5,212 డెంగీ కేసులు ఈ సీజన్‌లోనే నమోదు అయ్యాయని చెప్పారు.