
భువనేశ్వర్: ఒడిశా సివిల్ సర్వీసెస్–2018 పరీక్షల్లో దేవాశిష్ పండా టాపర్‌గా నిలిచారు. సోమవారం ఈ ఫలితాలు వెల్లడించారు. ఆయన సుందర్‌గడ్ జిల్లా జకాయికలా గ్రామస్తుడు. రితుపర్ణ మహాపాత్రో ద్వితీయ టాపర్‌గా, ఆకాశ కుమార్ పండా తీయ టాపర్‌గా నిలిచారు. గ్రూపు ఎ, గ్రూపు బి సేవల్లో భర్తీ కోసం ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది డిసెంబరు 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పర్సనాలిటీ పరీక్షల్లో 218 మంది అభ్యర్థుల్ని తాత్కాలికంగా ఎంపిక చేశారు. వారిలో 72 మంది యువతులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ పరీక్ష ఉత్తీర్ణత ఫలితాల పూర్తి వివరాలు http://opsc.gov.in వెబ్ పోర్టల్‌లో ప్రసారం చేశారు. సుందర్‌గడ్ జిల్లా ప్రజలు దేవాశిష్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment