ప్రతిపాదిత మండలాల జాబితాలో మోటకొండూరు గ్రామాన్ని చేర్చాలంటూ అఖిలపక్ష నాయకులు చేస్తున్న ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని మోటకొండూరు గ్రామాన్ని ప్రత్యేక మండలంగా మార్చాలని గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. గత వారం రోజులుగా యాదగిరిగుట్టలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్షలు చేస్తున్న అఖిలపక్ష నాయకులను పోలీసులు శనివారం అర్ధరాత్రి బలవంతంగా అక్కడినుంచి స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వరంగల్ వెళ్తున్న సందర్భంగా.. మోటకొండూరు గ్రామస్థులు కాన్వాయ్‌ను అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు ముందస్తు జాగ్రాత్తగా గ్రామానికి చెందిన 60 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఆమరణదీక్షలు భగ్నం చేసిన పోలీసులు
Published Sun, Oct 9 2016 10:00 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement