వైఎస్సార్‌ జిల్లాలో కరువు బృందం పర‍్యటన | Drought assessment: Central team visits ysr kadapa district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో కరువు బృందం పర‍్యటన

Published Tue, Jan 24 2017 11:10 AM | Last Updated on Mon, May 28 2018 1:30 PM

Drought assessment: Central team visits ysr kadapa district

కడప : అమితాబ్‌ గౌతమ్‌ అధ్యక్షతన డాక్టర్‌ కె. పొన్నుస్వామి, శ్రీ ప్రేమ్‌సింగ్‌ బృందం  కరువు పరిస్థితులను పరిశీలించేందుకు మంగళవారం వైఎస్సార్‌ జిల్లాలో పర‍్యటన ప్రారంభించింది. మంగళవారం ఉదయం 9.00 నుంచి 9.30 గంటల వరకు కడప స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో జిల్లా అధికారులు కరువుపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కడప నుంచి బయలుదేరి రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లె చెరువును పరిశీలించారు. అక్కడి రైతులతో చర్చించి కరువు పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.  ఉపాధి హామీ పనులను పరిశీలించారు.
 
అక్కడి నుంచి బయలుదేరి అదే మండలంలోని హసనాపురం గ్రామానికి చేరుకుని అక్కడున్న చెరువును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. 11.15 గంటలకు హసనాపురం నుంచి బయలుదేరి రాయచోటి మండలం యండపల్లె గ్రామానికి వెళతారు. అక్కడి చెరువును పరిశీలించాక రైతులతో మాట్లాడి కరువు పరిస్థితులను తెలుసుకుంటారు. ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పశువుల తాగునీటి తొట్లను పరిశీలిస్తారు. అలాగే అక్కడ జరుగుతున్న ఉపాధి హామీ పనులను చూస్తారు.
 
మధ్యాహ్నం 12.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాయచోటిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 1.20 గంటలకు రాయచోటి నుంచి బయలుదేరి సంబేపల్లెకు చేరుకుంటారు. అక్కడున్న ప్రభుత్వ చౌక దుకాణాన్ని, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఉన్న ఫిజోమీటరును పరిశీలిస్తారు. అనంతరం 1.40 గంటలకు ఆ మండలంలోని గుట్టపల్లె చెరువు వద్దకు చేరుకుంటారు. అక్కడ రైతులతో చర్చిస్తారు. అనంతరం 4.00 గంటలకు గుట్టపల్లెనుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement