కేంద్రమంత్రి సుజనాచౌదరి
తిరువళ్లూరు : విద్యతోనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్‌టెక్ వర్సిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5 వార్షికోత్సవ వేడుకలు, డిగ్రీలను ప్రదానం చేసే కార్యక్రమం వర్సిటీ చైర్మన్ డాక్టర్ రంగరాజన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి హాజరైన వారిని వైస్‌చైర్మన్ శకుంతలారంగరాజన్ ఆహ్వానించగా, డెరైక్టర్ కిషోర్‌కుమార్ అతిథిలను ఆహ్వానిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు.
కళాశాల వైస్‌చైర్మన్ మహలక్ష్మీరంగరాజన్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి సుజనాచౌదరి హాజరై 719 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ డిగ్రీలను తీసుకున్న విద్యార్థులు తమ మెదడుకు మరింత పదును పెట్టడంతో పాటు జీవితంతో స్థిరపడడానికి తమ వంతు ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు తమ చదువును డిగ్రీ అనంతరం నిలిపివేయకుండా భవిష్యత్తులో మరింత సాగించాలని ఆయన సూచించారు.
విద్యార్థులను నూతన పరిశోధనలవైపు సాగేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు చేసే నూతన పరిశోధనలు దేశానికి ప్రయోజనం చేకూరేలా ఉండాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.
విద్యతోనే సామాజిక ప్రగతి
Published Sat, Jul 4 2015 3:02 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement