సాక్షి, ముంబై: తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించినందుకుగాను ఎమ్మెన్నెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక శృంగారే కార్పొరేటర్ పదవిని ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు. 2012 ఫిబ్రవరిలో జరిగిన నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో విఖ్రోలిలోని కన్నంవార్ నగర్ వార్డు నంబరు 112 నుంచి ఎమ్మెన్నెస్ టికెట్‌పైప ఎస్సీ రిజర్వేషన్ కోటా కింద ప్రియాంక శృం గారే పోటీ చేశారు. అప్పట్లో నామినేషన్ పత్రాలతో ఆమె కులధ్రువీకరణ పత్రం సమర్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించారని ఆరోపిస్తూ రెండో స్థానంలో నిలిచిన శివసేనకు చెందిన అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వాస్తవాలను పరిశీలించిన కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ సదరు పత్రం సరైనది కాదంటూతేల్చి చెప్పిం ది. దీంతో ఆమె కార్పొరేటర్ పదవిని రద్దు చేస్తున్నట్లు మేయర్ సునీల్‌ప్రభు ప్రకటించారు. అంతేగాకుండా 2012 ఏప్రిల్ 17 నుంచి ఆమె బీఎంసీ ద్వారా పొం దిన గౌరవ వేతనం, ఇతర భత్యాలు, ఫలాలు తిరిగి తీసుకుంటామన్నారు. అంతటితో ఊరుకోకుండా ఆమెకు బీఎంసీ పరిపాలనా విభాగం అందజేసిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఫోన్ బిల్లుల తాలూకు సొమ్మును తిరిగి వసూలు చేసుకుంటామన్నారు.అయితే ప్రియాంక శృంగారే కార్పొరేటర్ పదవి రద్దు కావడంతో ఈ వార్డులో ఉప ఎన్నిక నిర్వహిస్తారా? లేక రెండో స్థానంలో నిలిచిన శివసేనకు చెందిన శ్రద్ధా రుకేకు కట్టబెడతారా? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుం టామని మేయర్ సునీల్ ప్రభు చెప్పారు.
కార్పొరేటర్ పదవి రద్దు
Published Sun, Mar 30 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement