మృత్యువులోనూ వీడని బంధం | father and son died in Road accident in Karnataka | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Published Fri, Mar 31 2017 12:02 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

మృత్యువులోనూ వీడని బంధం - Sakshi

మృత్యువులోనూ వీడని బంధం

► రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కుమారుడి దుర్మరణం
 
బెంగళూరు: మృత్యువులోనూ వారివురూ రక్తబంధం వీడలేదు. దారికాచిన మృత్యువు తండ్రీ, తనయుడిని ఒకేసారి పొట్టన బెట్టుకొని ఆ కటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన  హోసూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకొంది. వివరాలలు.. కర్ణాటకలోని సూళగిరి సమీపంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన మురుగేషన్‌(49) కుమారుడు ప్రవీణ్‌కుమార్‌(17) బెంగళూరులో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సొంతపనిపై ద్విచక్రవాహనంలో ఇద్దరూ బెంగళూరు బయల్దేరారు.
 
క్రిష్ణగిరి– బెంగళూరు జాతీయ రహదారిపై హోసూరు–రాయకోట కూడలి రోడ్డు వద్ద  సూళగిరి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బోర్‌వెల్‌ లారీ బైక్‌ను ఢీకొంది.  ప్రమాదంలో మురుగేషన్, ప్రవీణ్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి  నామక్కల్‌కు చెందిన  లారీ డ్రైవర్‌ పెరియస్వామిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement