కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కన్న కొడుకునే బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కన్న కొడుకునే బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురంలోని చంద్రబాబుకొట్టాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రిటైర్డ్ ఏఎస్సై ఇరిగప్ప కుమారుడు జితేంద్ర(30) ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆర్థిక విషయాల్లో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుగున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన ఇరిగప్ప కొడుకు తలపై బండరాయితో మోది హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉంది.