అగ్నిప్రమాదం : మహిళ సజీవదహనం
కర్నూలు (రాజ్‌విహార్): నగరంలోని బుధవార పేటలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన పూర్తి వివరాలు.. గనిగల్లిలో నివాసముంటున్న ఎస్ మాలిక్‌బాషా భార్య రుఖియాబీ(35) బుధవారపేటలోని అస్లాం కాటన్‌బెడ్స్ గోడౌన్‌లో దూది పరుపుల తయారీ పనులకు వెళ్తోంది. రోజు మాదిరిగా గురువారం రుఖియాబీ వెళ్లింది. మధ్యాహ్నం 1.30గంటలకు విద్యుదాఘాతంతో గోడౌన్‌లోని పత్తికి మంటలు వ్యాపించాయి. తోటి కూలీ పర్వీన్, యజమాని అస్లాం బయటకు పరుగులు తీయగా రుఖియాబీ బాత్‌రూంలోకి దూరింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేలోపు ఆమె మృతిచెందింది. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిరణ్‌కుమార్ తెలిపారు.