మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు మాలలు వేసుకున్నారు. 41 రోజులు నియమనిష్టలతో పూజలు చేశారు. శబరిమల వెళ్లారు. స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తూ తమిళనాడులోని పళణి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. టెంపో ట్రావెలర్ డ్రైవర్ అజాగ్రత్త నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో శబరిమల యాత్ర విషాదంగా ముగిసింది.
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ పరిధిలోని రామాచార్లపల్లె, బసినికొండకు చెందిన 22మంది అయ్యప్పమాల ధరించారు. ఆదివారం టెంపో ట్రావెలర్‌లో శబరిమలకు బయల్దేరారు. అయ్యప్పను దర్శించుకుని సంతోషంగా తిరుగు పయనమయ్యా రు.
మార్గమధ్యంలోని తమిళనాడు రాష్ట్రం పళణి సమీపంలోని దిండుగల్ రోడ్డులోని తేనె వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన ఉన్నలారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బసినికొండకు చెందిన రెడ్డిప్రసాద్(24), భవన నిర్మాణ కార్మికుడు బంట్రో తు చెండ్రాయుడు(54), పెద్దరెడ్డెప్ప (40), ములకల చెరువుకు చెందిన టెంపో ట్రావెలర్ యజమాని ఇమాంసాహెబ్ (35) మృత్యువాతపడ్డారు. వాహనంలో ఉన్న 15 మంది గాయపడ్డారు. అందులో బాబు, యుగంధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని బెంగళూరుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బసినికొండ, రామాచార్లపల్లెకు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనా స్థలం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ఎంపీ పరిధిలోకి రావడంతో అక్కడి ఎంపీతో మాట్లాడి మృతదేహాలకు సకాలంలో పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.
అన్యాయం చేసి వెళ్లిపోయావా..
గోవిందరాజులు, సుశీలమ్మకు రెడ్డిప్రసాద్ ఒక్కడే కుమారుడు. తండ్రి టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. తల్లి టిఫి న్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. వారు అష్టకష్టాలుపడి కుమారుడ్ని బీటెక్ చదివిం చారు. వారి కష్టాన్ని వృథాచేయకుండా రెడ్డి ప్రసాద్ మంచిమార్కులతో బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సమయంలో తోటి స్నేహితులు, బంధువులు మాలవేయడంతో వారితో పాటు మాలవేసి శబరి మలైకి వెళ్లాడు. పళణి వద్ద జరిగిన ప్ర మాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ‘ఇంత అన్యాయం చేసి వె ళ్లిపోయావా అంటూ వారు విలపిస్తున్నారు. ఉద్యోగం చేసి ఆసరాగా ఉంటాడనుకుంటే దేవుడు మాకు కడుపుకోత మిగిల్చాడని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇక మాకు దిక్కెవరు సామీ...
రామాచార్లపల్లెకు చెందిన బంట్రోతు చండ్రాయుడు(54) భవన నిర్మాణ కా ర్మికుడు. ఇతనికి భార్య లక్ష్మిదేవి, కుమార్తెలు సునీత, మధులత, కుమారుడు కిరణ్‌కుమార్ ఉన్నారు. నిర్మాణ పనులు చేస్తున్న చండ్రాయుడు ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి కాపురాలకు పంపాడు. కుమారుడ్ని బీటెక్ వరకు చదివించాడు. చాలా కాలంగా అయ్యప్పమాల ధరిస్తూ శబరిమలకు వెళ్లివస్తుండేవాడు. ఈ క్ర మంలో స్నేహితులు, బంధువులతో మాల వేయించి శబరిమలకు వెళ్లాడు. తిగిరి వస్తూ మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి చెందడంతో తమకు దిక్కెవరు సామీ అంటూ అతని భార్య, పిల్ల లు బోరున విలపిస్తున్నారు. నీవులేకుం డా బతికేదెలా అని రోదిస్తున్నారు.
భవిష్యత్ ఎలా?
రామాచార్లపల్లెకు చెందిన పెద్దరెడ్డెప్ప ఆటో నడుపుతూ, కాంట్రాక్టు పనులు చేసేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. సుబ్బలక్ష్మి, లత. కుమార్తె సునంద, కు మారుడు మౌనేష్. గ్రామంలో చురుగ్గా ఉంటూ అందరికీ సాయపడేవాడు. పళ ణి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మధ్యాహ్నం వరకు ప్రాణాలతో పోరాడాడు. రెడ్డెప్ప మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్య లు ఇద్దరూ కుప్పకూలిపోయారు. బిడ్డల భవిష్యత్ ఎలా అంటూ సుబ్బలక్ష్మి రోదించడం అందరినీ కలచివేసింది. నాన్న చనిపోయాడంటూ పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బురకాయల కోటలో విషాదం..
బురకాయల కోటకు చెందిన ఇమాం సాహెబ్(35) ఉపసర్పంచ్‌గా పనిచేశాడు. టెంపోట్రావెలర్‌కు యజమాని. డ్రైవర్ మహేష్‌కు సహాయకుడిగా శబరి మలకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్యా, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.