ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు | hca elections should be conduct on january 15: hicourt | Sakshi
Sakshi News home page

ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు

Published Wed, Jan 11 2017 4:24 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

hca elections should be conduct on january 15: hicourt

హైదరాబాద్‌: హెచ్‌సీఏ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. అయితే ఫలితాలు మాత్రం ఇప్పుడే వెల్లడించొద్దని ఆంక్షలు విధించింది. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హెచ్‌సీఏ కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయకపోవడంతోపాటు, పదవీకాలం ముగిసినా అధ్యక్షుడిగా ఉన్న అర్షద్‌ అయూబ్‌ కొనసాగతుండటంపై హైకోర్టు గతంలో తీవ్రంగా మండిపడింది.

హెచ్‌సీఏలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అర్షద్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 7నే ముగిసింది. అయినప్పటికీ ఆయన పదవిలో కొనసాగారు. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో తేలింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మరోపక్క, లోధా కమిటీ సిఫారసు ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా అలా చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది



Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement