దేవాలయానికి కన్నం | Hole in the temple | Sakshi
Sakshi News home page

దేవాలయానికి కన్నం

Published Wed, Mar 5 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

Hole in the temple

తుమకూరు
 ఆలయానికి కన్నం వేసి విలువైన బంగారు, వెండి వస్తువులను చోరీ చేశారు. తురువెకెరె పోలీసుల సమాచారం మేరకు... సోమవారం అర్ధరాత్రి శిరా తాలూకాలోని రామనహళ్లిలో ఉన్న లక్ష్మీదేవి ఆలయం వెనుక భాగాన కన్నం వేసి దుండగులు లోపలకు ప్రవేశించారు.

రెండు కిలోల బంగారు, నాలుగు కిలోల వెండి ఆభరణాలు, హుండిలోని నగదు అపహరించుకెళ్లారు. మంగళవారం ఉదయం ఐదు గంటలకు అర్చకులు ఆలయం తలుపులు తీసినప్పుడు చోరీ విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement