
రాజకీయాలపై ఆసక్తి లేదు
మండ్య: ప్రస్తుతానికి తాను ఏ రాజకీయ పార్టీలో చేర ట్లేదని ఏ రాజకీయ పార్టీ నుంచి తనకు ఆహ్వాన పత్రిక అందలేదని మైసూరు యువరాజు యధువీర్ శ్రీకంఠదత్త ఒడయార్ తెలిపారు. నగరంలోని అభినవ భారతి పీయూ కాలేజీలో నూతనంగా నిర్మించిన భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తండ్రి శ్రీకంఠదత్త ఒడయార్ రాజకీయ అనుభవంతో నాలుగు సార్లు మైసూరు ఎంపీగా పనిచేసారన్నారు. తనకు, ప్రజలకు మధ్య సంబంధాలు ఇంకా మెరుడుపడాల్సి ఉందని, తానింకా చాలా నేర్చుకోవాలి ఉందన్నారు.