పిల్లలకు పాఠాలు బోధించిన యువరాజు | Yaduveer to turn teacher for a day | Sakshi
Sakshi News home page

పిల్లలకు పాఠాలు బోధించిన యువరాజు

Published Sat, Jun 18 2016 10:19 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

పిల్లలకు పాఠాలు బోధించిన యువరాజు - Sakshi

పిల్లలకు పాఠాలు బోధించిన యువరాజు

మైసూరు: మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ శుక్రవారం పిల్లలు పాఠాలు బోధించారు. నగరంలోని పడువారహళ్లిలోని వినాయకనగర్‌లోనున్న ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఆయన ఏడవ తరగతి పిల్లలకు దసరా విశేషాలు, మైసూరు నగర చరిత్ర, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై గంటపాటు పాఠాలు చెప్పారు.

అనంతరం ప్రశ్నలు అడిగారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి, పిల్లలను ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించడానికి కలిసు ఫౌండేషన్ సంస్థ  ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని యదువీర కృష్ణదత్త ఒడయార్ తెలిపారు. ప్యాలెస్‌లో ఫోటోషూట్‌పై స్పందిస్తూ   ప్యాలెస్‌లో నిగూఢ శక్తి ప్రత్యేక ఆకర్షణ ఉందన్నారు.

ఇంత వరకు ఆయా ప్రదేశాల్లో తమ వంశానికి చెందిన వారు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలాంటి చర్యలు ఒడిగడితే వారికి శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement