ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్‌ను ప్రేరణగా తీసుకున్న రాష్ట్ర గవర్నర్ సీ.హెచ్.విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్, మంత్రాలయలో పారిశుధ్య కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
స్వచ్ఛ్‌భారత్ ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్
సాక్షి, ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్‌ను ప్రేరణగా తీసుకున్న రాష్ట్ర గవర్నర్ సీ.హెచ్.విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్, మంత్రాలయలో పారిశుధ్య కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాన్నే కాకుండా రాష్ట్రాన్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్ది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమా న్ని మొదట పబ్లిక్ స్థలాలు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు, మార్కెట్లు, తదితర ప్రాంతాల్లో ప్రారంభించాలన్నారు.
తాను ఈ నెల 18వ తేదీన జేజే ఆస్పత్రిని సందర్శిస్తానని, అక్కడ నిర్వహించే పారిశుధ్య కార్యక్రమంలో పాలుపంచుకుంటానన్నారు. స్వచ్ఛతా అభియాన్‌పై విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని విద్యాశాఖను కోరతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోలు, హౌసింగ్ సొసైటీలను భాగస్వామ్యులను చేయాలని ప్రధాన కార్యదర్శిని, బీఎంసీ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమ ప్రచారకులుగా అప్పా సాహెబ్ ధర్మాధికారి, అభిషేక్ బచ్చన్, నీతా అంబానీ, రాజశ్రీ బిర్లా, సునిధీ చౌహాన్, ప్రముఖ నటుడు మకరంద్ అనస్‌పురే, షూటర్ అంజలి భగ్‌వత్, మోనిక మోరే, తుషార్ గాంధీల పేర్లను ప్రకటించారు.