కమల్ నోట రాజకీయ మాట | If another Vishwaroopam row happens, I'll do a Husain by leaving India Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్ నోట రాజకీయ మాట

Published Wed, Nov 6 2013 10:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

కమల్ నోట రాజకీయ మాట

కమల్ నోట రాజకీయ మాట

* కమల్ నోట రాజకీయ మాట

* ఇంకా తగ్గని 'విశ్వరూపం' ఉద్వేగం

* విదేశాలకు వెళ్లిపోతానంటూ పునరుద్ఘాటన

 తానేంటో, తన సినిమాలేంటో అంటూ సాగిపోయే కమలహాసన్ తొలిసారిగా రాజకీయ వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టించారు. రాజకీయ నేతలపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. నేను దేశ నాయకుడిని అని చెప్పుకునే ఎవరితోనైనా చర్చకు సిద్ధమంటూ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సవాల్ విసిరారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:కోలీవుడ్‌లో ఎంజీఆర్, శివాజీ గణేషన్ తర్వాత తరంలో అంతటి జోడి హీరోలుగా రజ నీకాంత్, కమల్‌హాసన్ పేరు పొందారు. ఎంజీ ఆర్, శివాజీ గణేషన్ రాజకీయూల్లో తమదైన ముద్ర వేశారు. అలాగే రాజకీయూల్లోకి రావాలం టూ కమలహాసన్, రజనీకాంత్‌లపై అభిమానులు పలుమార్లు    ఒత్తిడి తెచ్చారు. రాజకీయ వాసన సోకకుండా కమల్ ఎంతో దూరంగా మెలుగుతున్నారు. రజనీ మాత్రం అప్పుడప్పుడూ ఊరిస్తుంటారు. ఎన్నికల సమయంలో   ఫలానా పార్టీకి ఓటేయాల్సిందిగా పిలుపునిస్తుంటారు. జాతీయ నాయకులతో చెలిమి చేస్తుంటారు. తమతో జత కట్టాలని రజనీకి వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతుంటాయి.
 
 ప్రస్తుతం రజనీకాంత్‌ను నరేంద్రమోడీ ద్వారా బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. కమల్ మాత్రం రాజకీయాలకు, రాజకీయ నాయకులకు దూరంగా మెలుగుతున్నారు. ఏదైన ప్రత్యేకమైన సందర్భాల్లో సినీ ప్రముఖుని హోదాలో జయలలిత, కరుణానిధిని కలుస్తున్నారు. రాజకీయాలపై అంతటి జాగ్రత్తలు తీసుకునే కమల్‌హాసన్ ఆశ్చర్యకరమైన రీతిలో ఉద్వేగంగా స్పందించారు. విశ్వరూపం సినిమా విడుదల సందర్భంగా ఎదుర్కొన్న చేదు అనుభావాలే ఆయన చేత అటువంటి మాటలు అనిపించాయని ఇట్టే తెలుసుకోవచ్చు. కమలహాసన్ మంగళవారం చెన్నైలో ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయూలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
 ప్రజలే నాయకులు
 ప్రజాసేవ పేరుతో రాజకీయాలు చేసేవారు, గెలిచి అధికారంలోకి వచ్చేవారు ప్రజా నాయకులు కాదని, ప్రజాప్రతినిధులు మాత్రమేనని కమల్ పేర్కొన్నారు. వాస్తవానికి ప్రజలే నాయకులని నొక్కి చెప్పారు. నేను దేశ నాయకుడిని అని చెప్పుకునే ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. కోలీవుడ్ నుంచి ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు, రాబోయే ఎన్నికల్లో మీరూ వస్తారా అనే ప్రశ్నకు స్పష్టమైనరీతిలో సమాధానమిచ్చారు. నటునిగా తన సంగతి తెలుసునని, ఏ విషయంలోనూ ఎవరినీ అనుకరించనని, తన బాట వేరేనని బదులిచ్చారు. రాజకీయ ప్రవేశం చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా నాకు ప్రేక్షకులు కావాలి, ఓటర్లు వద్దురూ. అంటూ రాజకీయ ఊహాగానాలకు తెరదించారు. ఐదేళ్లకోసారి ఓటు వేయడం ద్వారా తన రాజకీయ బాధ్యతను నెరవేరుస్తున్నానని వెల్లడించారు. ప్రతి పౌరుడూ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా మనోభిప్రాయాన్ని చాటాలన్నారు. ఉచితంగా దేశసేవ చేస్తాననే వారికే పాలనా బాధ్యత అప్పగించాలని సూచించారు. అటువంటి వారికి మంచి జీతం ఇచ్చి దేశాన్ని సరైన దిశగా నడిపే బాధ్యతను అప్పగించాలని తెలిపారు. రాజకీయాల్లో ఉండేవారిని దయచేసి నాయకులు అనవద్దని, వారు మన ప్రతినిధులు మాత్రమేనని పేర్కొన్నారు.
 
 విదేశాలకు వెళ్లిపోతా
 విశ్వరూపం సినిమా విడుదలలో ఎదురైన చేదు అనుభవాలు విశ్వరూపం-2కు సైతం పునరావృతమైతే శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమని కమల్ పునరుద్ఘాటించారు. మీడియా సమక్షంలో గతంలో చెప్పిన మాటలకు నేటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. వివాదాలు సృష్టించిన వారికి విడుదలకు ముందే విశ్వరూపం చూపానని, షేక్ హ్యాండ్లు ఇచ్చి మరీ అభినందించారని చెప్పారు. అయితే మరుసటి రోజే సినిమాను నిషేధించాలనే డిమాండ్లు లేవనెత్తారని విమర్శించారు. సినిమా సమాజంపై ప్రభావం చూపడం లేదని, సమాజంలో జరిగేదే సినిమాల్లో చూపిస్తున్నామని వివరించారు. బాబ్రీ మసీదు కూల్చివేసినపుడు ఆ అంశంపై నోరువిప్పిన ఒకే ఒక నటుడిని తాను మాత్రమేనన్నారు. ఎఫ్.ఎం.హుస్సేన్‌లా దేశాన్ని విడిచి వెళ్లేందుకు తానూ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉంటూ సినిమాలు తీసినా అడ్డుకుని తీరుతారని, ఎందుకంటే సెంటిమెంట్ పేరుతో అడ్డుకునే సంస్కృతికి వేళ్లూనుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా తనకు రాజకీయాలు లేవని ముగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement