బెంగళూరు నగర బస్సు సర్వీసులు ‘బీఎంటీసీ’లో గురువారం అర్ధరాత్రి నుంచి చార్జీలు పెరిగాయి. సగటున 15 శాతం మేరకు పెంచారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు నగర బస్సు సర్వీసులు ‘బీఎంటీసీ’లో గురువారం అర్ధరాత్రి నుంచి చార్జీలు పెరిగాయి. సగటున 15 శాతం మేరకు పెంచారు. డీజిల్ ధర పెంపుతో పాటు కార్మికులకు డీఏ పెంచిన నేపథ్యంలో చార్జీలను పెంచడానికి అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గురువారం నుంచి నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద చార్జీల పెంపునకు అనుమతినిచ్చింది. ఇదే బాటలో ఆర్టీసీ బస్సు చార్జీలూ పెరగనున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు కూడా రంగం సిద్ధమవుతోంది.