ఎక్కువ గంటలు పని చేయడంతో పోలీసులు అలసిపోతున్నారని శివసేన ఆరోపించింది...
ముంబై: ఎక్కువ గంటలు పని చేయడంతో పోలీసులు అలసిపోతున్నారని శివసేన ఆరోపించింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతోపాటు పోలీసుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయని సేన పేర్కొంది. ఇటివల ఓ ముంబై పోలీసు ఇన్స్‌పెక్టర్‌ను ఓ జూనియర్ అధికారి కాల్చిన నేపథ్యంలో సేన ఈ వ్యాఖ్యలు చేసింది. హోం శాఖ ఈ హత్యను కూడా ఇతర హత్యల్లానే పరిగణించి కేసు మూసేయాలని చూస్తోందా అని ప్రశ్నించింది.
శాంతి భద్రతలు కాపాడే వ్యక్తుల మానసిక స్థితి సరిగా లేకపోతే భవిశ్యత్‌లో హింస మరింత ఎక్కువవుతుందని అభిప్రాయపడింది. శనివారం సీనియర్ ఇన్స్‌పెక్టర్ విలాస్ జోషిని సబ్ ఇన్స్‌పెక్టర్ దిలిప్ శిర్కే కాల్చి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం శిర్కే విధులకు ఎందుకు హాజరవలేదని విలాస్ ప్రశ్నించగా తనపై కాల్పులు జరిపి, తాను కాల్చుకొని అత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
అనుభవమున్న ఇద్దరు పోలీసులు అనవసర వాగ్వివాదం వల్ల ప్రాణాలు కోల్పోయార ని సేన పేర్కొంది. ఇలాంటి ఘటనలు పోలీ్‌స్ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నది. కేసు దర్యాప్తునకు ఆదేశించిన సీఎం పోలీసుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తానన్నారు.