
ఆ మీడియాల స్వాధీనం సాధ్యమేనా?
ఎడపాడి, ఓపీఎస్ వర్గాలు జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికలను కైవసం చేసుకోవడం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇందులో భాగంగానే పై తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందుకు దినకరన్ మద్దతుదారుడైన నాంజిల్ సంపత్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఈ రెండు వ్యక్తిగత ఆస్తులని అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఎవరికీ హక్కు లేదని తెలిపారు. ఆ తరువాత జయ టీవీ సీఈఓ వివేక్ జయరామన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇళవరసి కుమారుడు. వివేక్ జయరామన్ తన ప్రకటనలో జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక ప్రైవేటు సంస్థలని పేర్కొన్నారు. వీటి స్వాధీనానికి తీర్మానం ప్రవేశపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ మీడియాలు ఎవరికి చెందుతాయన్న ఆసక్తి నెలకొంది.