Namadhu MGR newspaper
-
ఆ మీడియాల స్వాధీనం సాధ్యమేనా?
సాక్షి, చెన్నై : ఎడపాడి, ఓపీఎస్ వర్గాలు జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికలను కైవసం చేసుకోవడం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్‌సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశం సోమవారం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో నాలుగు ముఖ్య తీర్మానాలు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జయలలిత ప్రారంభించిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది వీరి లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగానే పై తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందుకు దినకరన్ మద్దతుదారుడైన నాంజిల్ సంపత్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఈ రెండు వ్యక్తిగత ఆస్తులని అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఎవరికీ హక్కు లేదని తెలిపారు. ఆ తరువాత జయ టీవీ సీఈఓ వివేక్ జయరామన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇళవరసి కుమారుడు. వివేక్ జయరామన్ తన ప్రకటనలో జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక ప్రైవేటు సంస్థలని పేర్కొన్నారు. వీటి స్వాధీనానికి తీర్మానం ప్రవేశపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ మీడియాలు ఎవరికి చెందుతాయన్న ఆసక్తి నెలకొంది. -
పత్రిక, టీవీ ఛానెల్ స్వాధీనం సాధ్యమేనా?
సాక్షి, చెన్నై: జయ టీవీ ఛానెల్‌తోపాటు, నమదు ఎంజీఆర్ పత్రికను ఏఐఏడీఎంకే వర్గాలు కైవసం చేసుకోవడం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. సీఎం ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలకు చెందిన ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం సోమవారం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో నాలుగు ముఖ్య తీర్మానాలను ఆమోదించారు. అందులో ఒకటి జయటీవీ, నమదు ఎంజీఆర్ పత్రికను స్వాధీనం చేసుకోవటం ఒకటి. ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితతో ప్రారంభించబడిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది ఈ రెండు వర్గాల లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగానే ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందుకు సోమవారం దినకరన్ మద్దతుదారుడైన నాంజిల్ సంపత్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఈ రెండూ వ్యక్తిగత ఆస్తులని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఎవరికీ హక్కు లేదని తెలిపారు. ఆ తరువాత జయటీవీ సీఈవో వివేక్ జయరామన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈయన ఇళవరసి కుమారుడు. జయటీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక ప్రైవేటు సంస్థలని ఆయన పేర్కొన్నారు. వీటి స్వాధీనానికి తీర్మానం ప్రవేశపెట్టడాన్ని ఖండించారు. ఈ పరిణామాలతో ఈ మీడియా సంస్థలు ఎవరికి చెందుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.