పీఎస్‌ఎల్‌వీ సీ36 రాకెట్‌ను డిసెంబర్ 7న ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 7 ఉదయం 9.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ36 రాకెట్‌ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది.
ఈనెల 28న దీన్ని ప్రయోగించాలనే లక్ష్యంతో పనులు పూర్తి చేసినప్పటికీ కొన్ని సాంకేతిక అవరోధాల కారణంగా డిసెంబర్ 7కు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.