కర్ణాటక,బనశంకరి: ఆదివారం కరోనా కర్ఫ్యూ సమయంలో భర్తకు భోజనం బాక్స్‌ను అందించడానికి ఓ పోలీసు భార్య ఆరుకిలోమీటర్లు నడిచివెళ్లిన ఘటన బెళగావిలో చోటుచేసుకుంది. ఆదివారం లాక్‌డౌన్ వల్ల హోటళ్లన్నీ బంద్ అయ్యాయి. బెళగావి దక్షిణ ట్రాపిక్ పోలీస్‌స్టేషన్‌లో అలీఖాన్ అనే కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. ఎన్‌డీ కోట సర్కిల్‌లో విధుల్లో ఉన్నాడు. ఏపీఎంసీ యార్డులో కుటుంబం నివసిస్తోంది. రెండు ప్రాంతాల మధ్య ఆరుకిలోమీటర్ల దూరం ఉంది. భోజనం తేవాలని భార్యకు ఫోన్ చేయగా, ఆమె ఆటోల కోసం చూసినా ఏవీ దొరకలేదు. దీంతో నడుచుకుంటూ క్యారియర్ తీసుకొచ్చి భర్తకు అందజేసింది. దీంతో అలీఖాన్ భార్య ప్రేమ పట్ల ఉబ్బితబ్బిబ్బయ్యాడు. లాక్‌డౌన్ సమయంలో మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతానని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment