నీవు లేని లోకంలో ఉండలేను.. | Love birds suiside in the three days of time | Sakshi
Sakshi News home page

నీవు లేని లోకంలో ఉండలేను..

Published Sat, Feb 18 2017 4:23 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

నీవు లేని లోకంలో ఉండలేను..

నీవు లేని లోకంలో ఉండలేను..

‘నీవు లేని లోకంలో నేను బతక లేను..’అంటూ ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

మొన్న ప్రియుడు.. నేడు యువతి
మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు బలవన్మరణం


కోల్‌సిటీ: ‘నీవు లేని లోకంలో నేను బతక లేను..’అంటూ ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మూడు రోజుల క్రితం తన కళ్లెదు టే ప్రియుడు ఉరేసుకోవడంతో అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆమె శుక్రవారం తానూ ఉరి వేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వ్యాపారి బోడకుంట చొక్కయ్య– రాజే శ్వరిల చిన్న కూతురు ప్రియాంక(24) ఎమ్మెస్సీ చదివింది. గోదావరిఖనికే చెందిన సింగరేణి ఉద్యోగి మార్క మొగిలి కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌గౌడ్‌(27) ప్రియాంకలు ప్రేమించుకున్నారు.

మైనింగి డిప్లొమా చేసిన ప్రవీణ్‌ శ్రీశైలం సమీపంలోని ప్రైవేటు కంపెనీలో, ప్రియాంక హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. ఇటీవల ఇద్దరు వేర్వేరు పనులపై గోదావరిఖనికి వచ్చారు. ఈ నెల 15న ప్రవీణ్‌ తల్లిదండ్రులు ఓ వివాహ వేడుకలకు వెళ్లడంతో ప్రియాంకను ఇంటికి రప్పించాడు. పెళ్లి చేసుకునే విషయంపై మరోసారి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏడాది తర్వాత చేసుకుందామని ప్రియురాలు చెప్పింది.

ఆవేశంతో చనిపోతానంటూ బెదిరిస్తూ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ప్రవీణ్‌ ఉరేసుకున్నాడు. కళ్లెదుటే ప్రవీణ్‌ చనిపోవడంతో మనస్తాపం చెందిన ప్రియాంక మూడు రోజులుగా మౌనంగా ఉంటోంది. దీంతో ఆమెను తల్లిదండ్రులు స్థానిక కాకతీయనగర్‌లోని ఆమె బాబాయ్‌ ఇం టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఇంటికి తీసుకు వచ్చారు. కాగా, టీవీ చూస్తున్న ప్రియాంక అకస్మాత్తుగా బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బెడ్రూం తలుపులు పగలగొట్టి చూడగా ఆమె సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement