ముంబయిలో ముష్కరుల సృష్టించిన నరమేధానికి అశువులు బాసిన అమరులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఘన నివాళులు అర్పించారు.
ముంబయి : ముంబయిలో ముష్కరుల సృష్టించిన నరమేధానికి అశువులు బాసిన అమరులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఘన నివాళులు అర్పించారు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో దాదాపు 180 మందికిపైగా అమాయకులు బలయిన విషయం తెలిసిందే. దాదాపుగా 700మందికి పైగా గాయపడ్డారు. ఇందులో కొందరు ఇప్పటికీ వికలాంగులుగానే ఉండిపోయారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు, విదేశీయులను స్మరించుకున్నారు.
నారీమన్ హౌస్ వద్ద ముఖ్యమంత్రి..అమరులకు పుష్పాగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా 26/11 అమరులకు ఘన నివాళి తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా ఉగ్రవాదులకు ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ముంబైలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ హోటళ్ల వద్ద భద్రతా దళాలు మోహరించాయి.