కానిస్టేబుల్ హత్యకేసులో నిందితుడి అరెస్టు
Published Wed, Oct 30 2013 11:57 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్యచేసిన మెవాటీగ్యాంగ్‌లో కీలక సభ్యుడిని అరెస్టు చేసినట్టు క్రైం బ్రాంచ్ ఏసీపీ రవిందర్‌యాదవ్ తెలిపారు. గతేడాది మే 18 రాత్రి భ రత్‌నగర్ పోలీస్ స్టేషన్‌పరిధిలో హోంగార్డు శంకర్‌తో కలిసి విధులు నిర్వహిస్తున్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నరేశ్‌కు వైర్‌లెస్‌లో ఓ కాల్ వచ్చింది. చోరీ వస్తువులు తీసుకెళుతున్న పోలీసులు అనుసరిస్తున్నారని, అటువైపుగా వస్తున్న వాహనాన్ని ఆపాల్సిందిగా సమాచారం అందింది. వెంటనే స్పందిచిన కానిస్టేబుల్ శంకర్ దొంగల వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించాడు.
ఇలా చిక్కారు:
నేరం జరిగిన విధానం ఆధారంగా మేవటి గ్యాంగ్ సభ్యులే ఈ నేరం చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. అదే దిశగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్యానాకి చెందిన ఈ ముఠాలో కీలక వ్యక్తిని షకీర్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని ఆచూకీ ఇచ్చిన వారికి రూ.లక్ష నగదుబహుమతి సైతం పోలీసులు ప్రకటించారు. గతేడాది నవంబర్‌లో ఈ ముఠా సభ్యుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం మిగిలిన వారికోసం వేట కొనసాగించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన బద్దన్ పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్టు తెలిసింది. ముమ్మరం గాలింపు అనంతరం ఈనెల 26న బద్దన్‌తోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement