సాక్షి, ముంబై: తమ డిమాండ్ల సాధనకోసం మిల్లు కార్మికులు నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు శని వారం సాయంత్రం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిర్ని కామ్‌గార్ ఏక్ జూట్ యూని యన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు, కార్మికులు భారీసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక కాలాచౌకిలోని షహీద్ భగత్‌సింగ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లాల్‌బాగ్, ఆర్థర్ రోడ్, లోయర్ పరేల్‌ల మీదుగా వర్లివరకు కొనసాగింది. అనంతరం వర్లిలోని అంబేద్కర్ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన సభలో పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ మిల్లు కార్మికులకు లేదా వారి వారసులకు ఉచితంగా ఇళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వ్యయాన్నికార్మికుల వద్దనుంచి కాకుండా మిల్లు యజ మానుల నుంచిగానీ లేదా బిల్డర్ల నుంచి గానీ వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్మికులందరికీ అర్హతపత్రాలు జారీ చేయాలని, అదేవిధంగా గత ఏడాది నిర్వహించిన లాటరీలో ఇళ్లు వచ్చిన కార్మికులను సంబంధిత అధికారులు ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని వక్తలు కోరారు. సాధ్యమైనంత త్వరగా ఇళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని, ఎన్‌టీసీ అధీనంలోని 90 హెక్టార్ల స్థలంలో కార్మికులకు ఇళ్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాం డ్ చేశారు. ఈ ర్యాలీలో కిశోర్ దేశ్‌పాండే, గన్నారపు శంకర్, ఉదయ్‌భట్, బబన్‌మోరే, మందాకినీ చవాన్ తదితరులు పాల్గొన్నారు.
మిల్లు కార్మికుల ర్యాలీ
Published Mon, Dec 16 2013 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement