mill workers
-
నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం: మోదీ
ఇండోర్: సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో హుకుంచంద్ మిల్లు కార్మికులకు రూ.224 కోట్ల మేర బకాయిలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. బకాయిల చెల్లింపుతో 4,800 మంది కారి్మకులకు లబ్ధి చేకూరనుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని హర్షం వ్యక్తం చేశారు. బిల్లు కారి్మకులకు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కరిపించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. మాలవీయ పుస్తకం ఆవిష్కరణ బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ రచనలు, లేఖలు, కరపత్రాలు, ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. మాలవీయ రచనలను ఆంగ్లం, హిందీ భాషల్లో 11 సంపుటాలుగా ప్రచురించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు సమాజానికి సరైన దశ దిశను చూపడంలో, ప్రజలకు సేవలందించడంలో క్రైస్తవుల పాత్ర పట్ల దేశం గరి్వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వారు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆయన క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో క్రైస్తవులతో సమావేశమయ్యారు. క్రైస్తవ వర్గం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పేదలకు సేవలందించడంలో క్రైస్తవులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. యేసు ప్రభువు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. వాజ్‌పేయికి ముర్ము, మోదీ నివాళులు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం ‘సదైవ్ అటల్’ వద్ద సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధి కోసం వాజ్‌పేయి అహరి్నశలూ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, హర్దీపుసింగ్ పురి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) ఇళ్లలో ఉంటున్న మిల్లు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యజమానులు తమ మాడా ఇళ్లను ఐదేళ్ల తరువాత అమ్ముకోవడానికి అనుమతినిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ఈ ఇళ్లను పదేళ్ల తరువాత మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండేది. కానీ, మిల్లు కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, వారి డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను సడలించడానికి అంగీకరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మిల్లు కార్మికులు, వారి వారసులు, కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో సుమారు 56 వస్త్ర మిల్లులు ఉండేవి. రెండు దశాబ్దాల కిందటి వరకు మిల్లు కార్మికులతో ముంబై నగరం కళకళలాడేది. అయితే, 2000-2005 సంవత్సరాల మధ్య కాలంలో దశలవారీగా వస్త్ర మిల్లులన్నీ మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ తరువాత మూతపడిన మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి, చౌక ధరకే అందజేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ మేరకు అనేక ఆందోళనలు జరిగాయి. మిల్లు కార్మికుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాయి. కార్మికుల డిమాండ్లకు ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడంతో అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన ప్రక్రియ పూర్తిచేసింది. లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి చౌక ధరకే వారికి ఇళ్లను అందజేసింది. అయితే, పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించరాదని, అద్దెకు కూడా ఇవ్వరాదని నిబంధనలు విధించింది. దీంతో కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తీవ్రం అయ్యాయి. ఇక్కడ ఎక్కువ ధరకు అద్దెకిచ్చి మరోచోట తక్కువ అద్దెకు ఉందామనుకున్న అనేక పేద కుటుంబాల ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అశనిపాతంగా మారాయి. దీంతో కార్మిక సంఘాలు ఈ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇళ్లను అద్దెకు ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ, ఇళ్లు వచ్చిన కార్మికుల్లో కొందరు చనిపోగా, వారి కుటుంబ సభ్యులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మరికొందరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసి అప్పుల పాలయ్యారు. ఉన్న ఇంటిని అమ్ముకొనైనా అప్పులు తీరుద్దామని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడదామని అనుకున్న వారి ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించడానికి వీలు లేకపోవడంతో గత్యంతరం లేని అనేక మంది గుట్టుచప్పుడు కాకుండా దళారుల ద్వారా అమ్ముకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ తగిన రుజువులు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. దళారీ వ్యవస్థ వల్ల కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అంతేగాక, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయనికి కూడా గండి పడుతోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇళ్లు కేటాయించిన ఐదేళ్ల తరువాత అమ్ముకునేందుకు వీలు కల్పించింది. ఇళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినివ్వడంతో దళారుల బెడద తప్పనుంది. అధికారికంగా క్రయ, విక్రయాలు జరగడం వల్ల రిజిస్ట్రేషన్, స్టాంపు ద్వారా ప్రభుత్వ ఖజానాలోకి అదనంగా ఆదాయం కూడా రానుంది. -
1న సీఎం నివాసం ముట్టడి
- డిమాండ్ల పరిష్కారం కోసం మిల్లు కార్మికుల నిర్ణయం - గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడి సాక్షి, ముంబై: డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసం వర్షా బంగ్లాను ముట్టడించాలని మిల్లు కార్మికులు నిర్ణయించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మే ఒకటిన గ్రాంట్రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ గా బయలుదేరి వెళ్లి వర్షా బంగ్లాను ఘేరావ్ చేయనున్నట్లు గిరిణ కామ్‌గార్ కృతి సమితి సభ్యులు తెలిపారు. మిల్లు కార్మికులకు ఇళ్లు నిర్మించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వ హ యాంలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. ఆ సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని బీజేపీ తెలిపింది. సమస్యల పరి ష్కారానికి 2015 జనవరి 20న గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి రవీంద్ర వాయ్‌కర్, అనంతరం ఫడ్నవీస్‌తో కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం సమావేశమై నివేదిక సమర్పించింది. అయితే అధికారంలోకొచ్చి ఏడునెలలు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న కార్మికులు ఎంహెచ్ఏడీఏ వద్ద అందుబాటులో ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించే పనులు ప్రారంభించింది. ఇక్కడ సుమారు ఎనిమిది వేల ఇళ్లు లభించనున్నాయి. అలాగే ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) 11 వేల ఇళ్లు నిర్మించింది. మొత్తం 19 వేలకుపైగా నివాసాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే వీటిని కార్మికులకు అందజేసే విషయంపై గాని, లాటరీ వేసే విషయం గానీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. -
మాడా ఇళ్లు.. 15 చివరితేదీ..!
సాక్షి, ముంబై: లాటరీలో ఇల్లు వచ్చిన మిల్లు కార్మికులు ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత పత్రాలతో కార్యాలయానికి రావాలని మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) సూచించింది. గడువు దాటిన తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ఆ ఇళ్లను పంపిణీ చేస్తామని హెచ్చరించింది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత వచ్చే వారిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. మూతపడిన మిల్లు స్థలాల్లో మాడా నిర్మించిన 6,925 ఇళ్లకు అర్హులను ఎంపికచేసి 2012 జూన్ 26న లాటరీ వేసింది. అందులో పేరు వచ్చిన కార్మికులకు లేఖలు పంపించింది. ఒక్కో ఇల్లుకు రూ.7.50 లక్షలు చెల్లించాలి. సంబంధిత పత్రాలతో మాడా కార్యాలయానికి రావాలని పేర్కొంది. ఇందులో సుమారు 80 శాతం మంది కార్మికులు రూ.7.50 లక్షలు నగదు చెల్లించగా, మరికొందరు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఇల్లు సొంతం చేసుకున్నారు. కాని 20 శాతం కార్మికులు ఇంతవరకు మాడాను సంప్రదించలేదు. లాటరీలో వారి పేరట వచ్చిన ఇళ్లు గత రెండున్నరేళ్లుగా ఖాళీగా పడిఉన్నాయి. లాటరీకి ముందు సమర్పించిన పత్రాలలో పొందుపర్చిన చిరునామాకు అధికారులు పలుమార్లు లేఖలు పంపించినప్పటికీ వారి నుంచి స్పందన రాలేదు. అందులో కొన్ని ఉత్తరాలు తిరిగి మాడా కార్యాలయానికి వచ్చాయి. దీంతో వారికి చివరి అవకాశం ఇచ్చామని, ఆ తర్వాత వారిని అనర్హులుగా ప్రకటించి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి సదరు ఇళ్లను కేటాయిస్తామని మాడా అధికారులు స్పష్టం చేశారు. -
మిల్లు కార్మికులకు ఇళ్లు..
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు శుభవార్త. వారికి త్వరలో ఆరు వేల ఇళ్లు వడాల ప్రాంతంలో అందుబాటులోకి రానున్నాయి. అందుకు అవసరమైన ఎనిమిది ఎకరాల స్థలాన్ని వాడియా గ్రూప్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు వడాలలోని బాంబే డయింగ్ యూనిట్లో ఉన్న స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించించింది. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్థి సంస్థ (మాడా) కూడా అంగీకరించింది. దీంతో అందులో మిల్లు కార్మికుల కోసం ఆరువేల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు మాడాకు మార్గం సుగమమైంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి... వాడియా గ్రూప్ యజమానికి ప్రభాదేవి, వడాల ప్రాంతంలో మిల్లు స్థలాలున్నాయి. ప్రభుత్వ నియమావళి 58 ప్రకారం మొత్తం స్థలాన్ని మూడు భాగాలు చేయాలి. అందులో ఒక భాగం మిల్లు యజమానికి, రెండో భాగం బీఎంసీకి, మూడో భాగం మాడాకు అప్పగించాలి. ఆ ప్రకారం ప్రభాదేవి, వడాలలో ఉన్న స్థలాలను అప్పగించాలని మాడా పట్టుబట్టింది. కాని ఆ స్థలాన్ని ఇచ్చేందుకు అప్పట్లో వాడియా గ్రూపు నిరాకరించింది. దీంతో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. కాని కోర్టులో ఈ కేసు ఎటూ పరిష్కారం కాకుండా పెండింగులో పడిపోయింది. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన వాడియా గ్రూపు నియమాల ప్రకారం బాంబే డయింగ్ నుంచి రావల్సిన ఒక భాగం స్థలాన్ని వడాలలో ఉన్న యూనిట్లో ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఒకే చోట రెండు భాగాల స్థలం లభించడంతో పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మించేందుకు అవకాశం లభించింది. మాడా 2012లో 6,925 ఇళ్లు నిర్మించి వాటిని లాటరీ ద్వారా అర్హులైన వారికి అందజేసిన విషయం తెలిసిందే. వడాలలో నిర్మించనున్న ఆరు వేల ఇళ్లకు త్వరలో లాటరీ వేసేందుకు రంగం చేయనుంది. -
ఉచితంగా ఇళ్లు ఇవ్వకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తాం
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని, త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం నగరంలో మిల్లు కార్మికులు, వారి వారసులు ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. గిర్నీ కామ్‌గార్ కర్మచారి కల్యాణ్‌కారి సంఘ్, గిర్నీ కామ్‌గార్ సేనా, గిర్నీ కామ్‌గార్ ఏక్జూట్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం దాదర్‌లోని వీర్ కోత్వాల్ ఉద్యాన్ నుంచి మొదలైన ఈ ర్యాలీ కాంగ్రెస్ కార్యాలయమైన తిలక్భవన్ వరకు సాగింది. ఇందులో సుమారు వేయిమందికిపైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సాయంత్రం ఏర్పాటుచేసిన బహిరంగసభలో సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల్లో ఉచితంగా ఇళ్లు ఇచ్చేలా తీర్మానాన్ని చేయాలని, లేని పక్షంలో మిల్లు కార్మికులు అత్యధికంగా ఉంటున్న 11జిల్లాల్లోని ప్రజలు, వారి బంధువులు సెప్టెంబరులో జరగనున్న శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తారని హెచ్చరించారు. గత అనేక సంవత్సరాల నుంచి ఇళ్ల సమస్యపై పోరాడుతున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడైన తమ సమస్యను పరిగణనలోకి తీసుకొని మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో 11 జిల్లాలతోపాటు మిగతా ప్రాంతాల్లో ఉంటున్న కార్మికులు, వారి వారసులు, బంధువులు ఓటు హక్కును వినియోగించుకోరని హెచ్చరించారు. -
ప్రభుత్వంపై పోరుకు మద్దతు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచితంగా ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పలు రాజకీయ పార్టీలు హామీలిచ్చాయి. ఈ సమస్యపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం పోర్చుగీస్ చర్చి సమీపంలోని అమర్హింద్ మండల్ హాలులో సమావేశం జరిగింది. గిర్ని కామ్‌గార్ కర్మచారి నివారా, కల్యాణ్‌కారి సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ మినహా శివసేన, జీజేపీ, ఆర్పీఐ, శేత్కారీ కామ్‌గార్ తదితర పార్టీల నాయకులు హాజరయ్యారని ఆ సంస్థ అధ్యక్షుడు కిశోర్ దేశ్‌పాండే, కార్యాధ్యక్షుడు దత్తా రాణే, కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ చెప్పారు. ప్రతి మిల్లు కార్మికునికి ఉచితంగా ఇల్లు ఇవ్వాలనే ప్రతిపాదనతో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన పార్టీలు తమ తమ వైఖరిని ప్రకటించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిశోర్ దేశ్‌పాండే మాట్లాడుతూ ముంబైలోని జాతీయ టెక్స్టైల్ కార్పొరేషన్ (ఎన్టీసీ) అధీనంలోగల 150 ఎకరాల స్థలాన్ని కార్మికుల ఇళ్ల కోసం అందజేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెమ్మార్డీయే సంస్థ నగర శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లు తమకు అవసరం లేదని, ముంబైలో మూతపడిన మిల్లు స్థలాల్లో నిర్మించే ఇళ్లు కావాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, అందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఇందుకు పలు పార్టీల నాయకులు అంగీకరించడంపట్ల కార్మికులు, ఆయా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మేమే ముందు కార్మికుల ఇళ్ల కోసం జరుపుతున్న పోరాటంలో తమ పార్టీ ముందుందని శివసేన నాయకుడు దివాకర్ రావుతే పేర్కొన్నారు. కార్మికులు నిర్వహించిన వివిధ ర్యాలీల్లో స్వయంగా ఉద్ధవ్ ఠాక్రే పాల్గొని సంఘీభావం తెలిపారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే మిల్లు కార్మికుల ఇళ్ల సమస్య పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శతాబ్దం క్రితం నామమాత్రపు రుసుంతో మిల్లు స్థలాలు పొందిన యజమానులు ఇప్పుడు కోట్లాది కూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఏక్నాథ్ మానే ఆరోపించారు. ఆ స్థలాలను కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకే వినియోగించాలని డిమాండ్ చేశారు. -
ఇళ్ల నిర్మాణమే లేదు...అప్పుడే లాటరీనా?
సాక్షి, ముంబై: ఇంకా నిర్మాణమే ప్రారంభం కాలేదు... అప్పుడే మిల్లు స్థలాల్లో నిర్మించనున్న ఇళ్లకు మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) లాటరీ వేయాలని నిర్ణయించడం కార్మికుల్లో ఆందోళనను కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం నిర్మించిన ఇళ్ల ధరలు రూ.7.50 లక్షలకు కేటాయించిన మాడా ప్రస్తుతం నిర్మించనున్న ఇళ్ల ధరలు ఏకంగా రూ.20 లక్షలుగా నిర్ణయించడంతో ఏమి చేయాలో మిల్లు కార్మికులకు పాలుపోవడం లేదు. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సమకూర్చి ఇవ్వాలో తెలియక తికమక పడుతున్నారు. బ్యాంక్‌ల ద్వారా రుణం ఇప్పిస్తామని మాడా చెబుతున్నా అవి అచరణ రూపంలోకి వచ్చేసరికి ఏమి జరుగుతుందోనన్న ఆందోళన మిల్లు కార్మికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లతోపాటు మిల్లు కార్మికుల కోసం నిర్మించనున్న ఇళ్లకు కూడా ఒకేసారి లాటరీ వే యాలని మాడా నిర్ణయించడంపై వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తెలుగు మిల్లు కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల మాడా శివారులోని వివిధ ప్రాంతాల్లో 878 ఇళ్లు నిర్మించింది. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు విక్రయించడం, యాక్సిస్ బ్యాంకుల్లో స్వీకరించడం లాంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ఇళ్లకు మే 31న లాటరీ వేయాలని మాడా తేదీని ఖరారు చేసింది. అలాగే మిల్లు కార్మికుల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇటీవల భూమిపూజ చేశారు. ఈ ప్రకారం మాడా అధీనంలోకి వచ్చిన వివిధ మిల్లు స్థలాల్లో మొత్తం 2,610 ఇళ్లు నిర్మించనుంది. వీటికి 21,954 దరఖాస్తులు లాటరీలో వేయనున్నారు. ఇందులో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే. ఇళ్లను త్వరగా అప్పగించాలనే: సతీష్ గవాయి ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభం కాగానే, లాటరీ వేసి కార్మికుల పేర్లు ప్రకటిస్తే తదుపరి ప్రక్రియ పూర్తిచేయడం సులభంగా ఉంటుందని మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి అన్నారు. లాటరీలో ఇళ్లు వచ్చినవారు మాడాకు అనేక రకాల పత్రాలు, రుజువులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ చాలా సమయంతో కూడుకున్నది కావడంతో ముందే పేరు ప్రకటించడంవల్ల వారికి ఈ పత్రాలను సేకరించుకునేందుకు తగిన సమయం లభిస్తుందన్నారు. అప్పటివరకు ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. వెంటనే అర్హులకు ఇళ్లు అందజేయవచ్చని గవయి అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం ఆరు మిల్లు కార్మికుల దరఖాస్తులు ఉన్నాయి. అందులో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు కార్మికులకు ఏప్రిల్ ఒకటి నుంచి 31 వరకు గడువు ఇచ్చాం. ఇళ్ల ధరలు కచ్చితంగా ఎంత మేర ఉంటాయనేది ఇంకా నిర్ణయించలేదు. లాటరీ ప్రక్రియ మాత్రం పూర్తిచేస్తామ’ని గవయి స్పష్టం చేశారు. -
ఇళ్లు ఇస్తాం.. ఆందోళన వద్దు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులందరికీ తప్పక ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై కార్మికులుగాని, వారి వారసులుగాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్ట్‌కు శనివారం సాయంత్రం సీఎం చవాన్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి చవాన్‌తోపాటు కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా, ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, దత్తా ఇస్వాల్కర్, ప్రవీణ్ ఘాగ్, జయశ్రీ ఖాడిల్కర్, గన్నారపు శంకర్ తదితరులు హాజరయ్యారు. తొలుత సెంచురీ మిల్లులో భూమి పూజ చేశారు. అనంతరం జాంబోరి మైదానంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చవాన్ కార్మికులనుద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) ఆధీనంలోకి వచ్చిన 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. తొలి విడతలో కాలాచౌకి, ప్రభాదేవి ప్రాంతాల్లో నిర్మించిన 6,925 ఇళ్లను 2012 జూన్‌లో లాటరీ ద్వారా అర్హులకు అందజేశామని గుర్తు చేశారు. సెంచురీ మిల్లు స్థలాల్లో నిర్మించే ఇళ్లతోపాటు మాడా, ఎమ్మెమ్మార్డీయే ప్రస్తుతం నిర్మిస్తున్న, భవిష్యత్‌లో నిర్మించబోయే వాటిలో కూడా మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ఆందోళ న చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సెంచురీ మిల్లులో తొలి విడతలో 1,430 ఇళ్లు నిర్మించనున్నారు. అందులో 651 ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించుకుంటుందని చవాన్ తెలిపారు. రూబీ మిల్లులో నిర్మిం చనున్న 23 ఇళ్లలో ఎనిమిది ట్రాన్సిట్ క్యాంపులు, పశ్చిమ మిల్లులో 250 ఇళ్లకు 124 ట్రాన్సిట్ క్యాం పులు, ప్రకాశ్ కాటన్ మిల్లో నిర్మించనున్న 562 ఇళ్లల్లో 281 ట్రాన్సిట్ క్యాంపులు, భారత్ మిల్లోని 188 ఇళ్లలో 93, జూబిలీ మిల్లోని 157 ఇళ్లలో 78 ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయిస్తున్నామని సీఎం చవాన్ వివరించారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రసంగం కొనసాగుతుండగానే 1.42 లక్షల కార్మికులకి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కరీరోడ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిని రాత్రి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మిల్లు స్థలాల్లో కార్మికులకు ఇళ్లు
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు శుభవార్త. మూతపడిన మిల్లు స్థలాల్లో రెండో విడతలో నిర్మించనున్న ఇళ్లు త్వరలో కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. మహారాష్ట్ర హౌసింగ్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (మాడా) అధీనంలో ఉన్న 16 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో శనివారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ ప్రాజెక్ట్‌కు భూమిపూజా చేయనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే చవాన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో జాంబోరి మైదానంలో కార్మికుల విజయోత్సవ ర్యాలీ జరగనుంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సెంచురీ మిల్లు స్థలంలో జరగనున్న ఈ ర్యాలీకి గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ ఆహిర్, కేంద్ర సహాయ మంత్రి మిలింద్ దేవరా తదితరులు హాజరవుతారని గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఘాగ్ తెలిపారు. నాలుగు మిల్లుల కార్మికుల యూనియన్ ప్రతినిధులు నిర్వహించనున్న ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యే అవకాశాలుండడంతో నాయకులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకు మాడా అధీనంలోకి వచ్చిన 19 మిల్లు స్థలాల్లో దాదాపు 10వేల ఇళ్లు నిర్మించింది. ఇందులో కార్మికులు, వారి వారసులకు 6,925 ఇళ్లు కేటాయించింది. మిగతా ఇళ్లు ట్రాన్సిట్ క్యాంపులకు కేటాయించింది. ఆ ఇళ్లను 2012 జూన్ 28న లాటరీ నిర్వహించి అర్హులైన కార్మికులకు అందజేసింది. ఇంకా 16 మిల్లుల స్థలాలు మాడా అదీనంలో ఉన్నా, అందులో ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రాజెక్టు ఇంతవరకు ప్రారంభించలేదు. దీంతో గిరిణి కామ్‌గార్ సంఘర్ష్ సమితి, రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్, మహారాష్ట్ర గిరిణి కామ్‌గార్ యూనియన్, సెంచురీ మిల్లు కామ్‌గార్ ఏక్తా మంచ్ తదితర యూనియన్లు తరచూ ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు రెండో విడతలో మాడా ద్వారా కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని భవనాల నిర్మాణ పనుల ప్రణాళికను బీఎంసీకి ఇప్పటికే పంపించారు. మంజూరు లభించగానే ప్రత్యక్షంగా పనులు ప్రారంభమవుతాయి. 16 మిల్లు స్థలాల్లో మాడా సుమారు 11,503 ఇళ్లు నిర్మించనుంది. ఇందులో 7,697 ఇళ్లు కార్మికులు, వారి వారసులకు కేటాయించనుంది. మిగతా ఇళ్లు మాడా ట్రాన్సిట్ క్యాంపులకు వినియోగించనుంది. -
మిల్లు కార్మికులకు ఇళ్లు రెడీ
సాక్షి, ముంబై: మిల్లు కార్మికులకు ఇళ్లు ఇచ్చేందుకు ఎట్టకేలకు ముహూర్తం లభించింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిర్మిస్తున్న ఇళ్లలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికుల కోసం కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 18న అధికారికంగా ఆదేశాలు జారీ అవుతాయని సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే సుమారు 35 వేల ఇళ్లు మిల్లు కార్మికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని మాడా లాటరీ ద్వారా మిల్లు కార్మికులకు అందజేయనుంది. ఎమ్మెమ్మార్డీయే ఇళ్లు, మిల్లు స్థలాల్లో కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లు, మాడా లాటరీ డ్రా ద్వారా ఇవ్వనున్న ఇళ్లు స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలపై మిల్లు యూనియన్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఆజాద్ మైదానంలో ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’, ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్’, మహారాష్ట్ర గిర్నీ కామ్‌గార్ యూనియన్, సెంచురీ మిల్లు కామ్‌గార్ సంఘటన ఆధ్వర్యంలో ఆందోళన కూడా జరిగింది. అనంతరం మిల్లు కార్మిక యూనియన్ల ప్రతినిధుల బృందం సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో కార్మిక శాఖ సహాయక మంత్రి సచిన్ అహిర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీయే నిర్మిస్తున్న ఇళ్లలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఆదేశాలు బయటికి రాలేదని సచిన్ తెలిపారని యూనియన్ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. ప్రస్తుతం 69 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో సుమారు 35 వేల ఇళ్లు మిల్లు కార్మికులకు లభించనున్నట్టు సచిన్ ఆహిర్ పేర్కొన్నారని వివరించారు. కాగా, సెంచూరీ, బాంబే డాయింగ్తోపాటు 12 మిల్లుల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిలో వర్లీలోని సెంచురీ మిల్లు స్థలంలో ఫిబ్రవరి 30వ తేదీన భూమిపూజ నిర్వహించనుంది. తొందర్లోనే గృహ ప్రవేశం... లాటరీలో ఇళ్లు గెలుచుకున్న మిల్లు కార్మికులకు తొందర్లోనే ఇళ్ల తాళం చెవులు లభించనున్నాయి. ఇళ్లను కార్మికులకు అందించేందుకు కావల్సిన ‘ఓసీ’ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లభించింది. తొందర్లోనే గృహ ప్రవేశం చేయనున్నారు. -
మిల్లు కార్మికుల ర్యాలీ
సాక్షి, ముంబై: తమ డిమాండ్ల సాధనకోసం మిల్లు కార్మికులు నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు శని వారం సాయంత్రం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గిర్ని కామ్‌గార్ ఏక్ జూట్ యూని యన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు, కార్మికులు భారీసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక కాలాచౌకిలోని షహీద్ భగత్‌సింగ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లాల్బాగ్, ఆర్థర్ రోడ్, లోయర్ పరేల్ల మీదుగా వర్లివరకు కొనసాగింది. అనంతరం వర్లిలోని అంబేద్కర్ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన సభలో పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ మిల్లు కార్మికులకు లేదా వారి వారసులకు ఉచితంగా ఇళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వ్యయాన్నికార్మికుల వద్దనుంచి కాకుండా మిల్లు యజ మానుల నుంచిగానీ లేదా బిల్డర్ల నుంచి గానీ వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్మికులందరికీ అర్హతపత్రాలు జారీ చేయాలని, అదేవిధంగా గత ఏడాది నిర్వహించిన లాటరీలో ఇళ్లు వచ్చిన కార్మికులను సంబంధిత అధికారులు ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని వక్తలు కోరారు. సాధ్యమైనంత త్వరగా ఇళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని, ఎన్టీసీ అధీనంలోని 90 హెక్టార్ల స్థలంలో కార్మికులకు ఇళ్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాం డ్ చేశారు. ఈ ర్యాలీలో కిశోర్ దేశ్‌పాండే, గన్నారపు శంకర్, ఉదయ్భట్, బబన్మోరే, మందాకినీ చవాన్ తదితరులు పాల్గొన్నారు. -
మిల్లు కార్మికుల దీక్ష విరమణ
సాక్షి, ముంబై: నూతన సంవత్సరంలో మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయించడానికి ‘ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ’ (ఎంఎంఆర్డీయే) ఒప్పుకోవడంతో వారు తమ పోరాటాన్ని గురువారం విరమించారు. ఎంఎంఆర్డీయే నిర్మిస్తున్న వాటిలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ ఇళ్లను ఇచ్చేందుకు అవసరమైన అనుమతులు రావడానికి కొంత సమయం పట్టనుంది. దీంతో నూతన సంవత్సరంలో మిల్లు కార్మికులకు 50 శాతం ఇళ్లు కేటాయించడం ఖాయమేనని ఎంఎంఆర్డీయే వర్గాలు తెలిపాయి. ఇళ్ల కేటాయింపు డిమాండ్‌తో 25 మంది మిల్లు కార్మికులు ఆజాద్ మైదాన్‌లో బుధవారం ఉదయం నుంచి అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది మిల్లు కార్మికులకు ఇళ్లు ఇవ్వడం, ఎంఎంఆర్డీయేకి చెందిన 50 శాతం ఇళ్లు కార్మికులకు కేటాయిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో కార్మికులు ఆందోళనకు దిగడం తెలిసిందే. ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం వీరితో చర్చలు జరిపింది. ఎట్టకేలకు మిల్లు కార్మికుల డిమాండ్లన్నంటినీ నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో వారు నిరాహారదీక్షతోపాటు ఆందోళనలను విరమించుకున్నారు. దీక్షలో పాల్గొన్న మరాఠీ దినపత్రిక నవకాల్ సంపాదకురాలు జయక్ష ఖాడీల్కర్-పాండే, ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’ అధ్యక్షులు దత్తా ఇస్వాల్కర్, ‘సెంచరీ మిల్ కామ్‌గార్ ఏక్తామంచ్’కు చెందిన నందూ పార్కర్ తదితరులు ఓ వయోధిక మహిళ కార్మికురాలు అందించిన పానీయం సేవించి దీక్ష విరమించారు. ఎంఎంఆర్డీయే నిర్మిస్తున్న ఇళ్లను చౌకగా అద్దెకు ఇస్తామని గతంలో ఈ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామితో మిల్లు కార్మికులకు ఇళ్లపై 50 శాతం యాజమాన్య హక్కులు కూడా దక్కుతాయి. -
గూడు కోసం పోరు
సాక్షి, ముంబై: ఇళ్ల కోసం మిల్లు కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆజాద్‌మైదాన్‌లో బుధవారం ఉదయం నుంచి 25 మంది అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన విరమించేది లేదని వీరు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కోసం 12 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమేగాకా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి (ఎమ్మెమ్మార్డీయే) చెందిన 50 శాతం ఇళ్లు కార్మికులకు అందజేస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గతంలో హామీ ఇచ్చారు. ఈ హామీని ఆయన నిలబెట్టుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం, మాడా అధికారులతో భేటీ అయి, వారి వినతిపత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదని మాజీ కార్మికుడు గన్నారపు శంకర్ ఆరోపించారు. అందుకే బుధవారం నుంచి రెండోసారి ఆందోళనకు దిగాల్సివచ్చిందని ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘ్’ ఉపాధ్యక్షుడు భజరంగ్ చవాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు బుధవారం నుంచి 25 మంది ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మిగతా కార్మికులు కూడా వీరికి మద్దతుగా వేర్వేరు పద్ధతుల్లో నిరసనలు తెలుపనున్నట్టు చెప్పారు. నిరాహార దీక్ష చేస్తున్నవారిలో మరాఠీ దినపత్రిక నవకాల్ సంపాదకురాలు జయక్ష ఖాడీల్కర్ పాండే, ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’ అధ్యక్షుడు దత్తా ఇస్వాల్కర్, ‘సెంచరీ మిల్ కామ్‌గార్ ఏక్తామంచ్’కు చెందిన నందూ పార్కర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రీయ మిల్లు మజ్దూర్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ మోహితే, నివృత్తి దేశాయి, అన్నా శిర్సేకర్ తదితరులు మిల్లు కార్మికులకు మార్గదర్శనం చేసి ఆందోళన గురించి తెలియపరిచారు. పరేల్‌లో నేడు రాస్తారోకో... ఆందోళనను మరింత తీవ్రం చేయాలన్న ఉద్దేశంతో గురువారం ఉదయం పరేల్‌లోని దాల్వీ బిల్డింగ్ ఎదుట రాస్తారోకో నిర్వహించనున్నట్టు భజరంగ్ చవాన్ తెలిపారు. రాష్ట్రీయ మిల్లు మజ్దూర్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ మోహితే ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో జరగనుందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తొందరగా స్పందించకుంటే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. జాప్యమే కారణం అర్హులైన మిల్లు కార్మికులకు తక్కువ ధరకు ఇళ్లు నిర్మించేందుకు మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) ముందుకు వచ్చింది. ఇళ్ల నిర్మాణానికి నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్‌కు(ఎన్టీసీ) చెందిన తొమ్మిది మిల్లులుసహా మూడు ప్రైవేటు మిల్లులు ఇలా మొత్తం 12 మిల్లుల స్థలాలను మాడా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇళ్ల ధరలు ఎలా నిర్ణయించాలనే అంశం ఎటూ తేలకపోవడంతో నిర్మాణ పనులు పెండింగులో పడ్డాయి. దీంతో మిల్లు కార్మికుల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో వారు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. సెంచరీ, ప్రకాశ్ కాటన్, రూబీ ఇలా మూడు ప్రైవేటు మిల్లులతోపాటు తొమ్మిది ఎన్టీసీ మిల్లుల స్థలాలు మాడా అధీనంలో ఉన్నాయి. సెంచరీ మిల్లు స్థలంలో 2,500, ప్రకాశ్ కాట న్మిల్లు స్థలంలో 1,200, రూబీ మిల్లు స్థలంలో 500 ఇళ్లు నిర్మించవచ్చు. మిగతా తొమ్మిది మిల్లు స్థలాల్లో 2,800 ఇళ్లు నిర్మించేందుకు వీలుందని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్మించే వాటిలోనూ 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు ఇవ్వనున్నట్టు సీఎం హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ‘నిబంధనల్లో మార్పులు చేయడానికి మరో నెల సమయం కావాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆదేశాలు జారీచేస్తామని చవాన్ హామీ ఇచ్చారు. ఇంత వరకు ఆయన ఇచ్చిన హామీ నెరవేరనేలేదు’ అని నాయకులు వివరించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరించారు. -
మిల్లు కార్మికులకు ఇళ్ల వరాలు
సాక్షి, ముంబై: నగరంలోని 12 మిల్లుల స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా కోరిన మిల్లు కార్మికులపై సీఎం వరాల జల్లు కురిపించారు. ఖాళీగా ఉన్న మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వడమేగాకుండా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎమ్మెమ్మార్డీయే)కి చెందిన ఇళ్లలో కూడా 50 శాతం ఇళ్లను కార్మికులకే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం కార్మిక నాయకులు, మిల్లు కార్మికుల ప్రతినిధులు ముఖ్యమంత్రి చవాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు... 1.42 లక్షల మిల్లు కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, గత సంవత్సరం మాడా నిర్వహించిన లాటరీలో ఇల్లు వచ్చిన కార్మిలకు వెంటనే అందజేసే ప్రక్రియను పూర్తిచేయాలని, ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన మిల్లు స్థలాల్లో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎంను కోరారు. వారి డిమాండ్లను విన్న చవాన్ సానుకూలంగా స్పందించారు. 12 మిల్లు స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశంపై మాడాతో చర్చలు జరుపుతామని, ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెమ్మార్డీయే ఇళ్లలో కూడా సగం ఇళ్లను కార్మికులకే ఇస్తామన్నారు. వీటిని నిర్మించి ఇవ్వడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.? అనే విషయమై ఎమ్మెమ్మార్డీయే అధికారులతో కూడా చర్చిస్తానన్నారు. 50 శాతం ఇళ్లు ఇవ్వడానికి నియమ, నిబంధనాల్లో ఎమైనా మార్పులు చేయాల్సి వస్తే నెల రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తామని చెప్పారు. బాంబే డయింగ్ మిల్లు స్థలం లభిస్తే అందులో కార్మికుల కోసం ఐదువేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశముంటుందని, ఈ స్థలం ప్రభుత్వ అధీనంలోకి వచ్చేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, అందుకు చట్టపరంగా సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ అధీనంలోకి వచ్చిన 12 మిల్లు స్థలాల్లో 300 చదరపుటడుగుల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండగా ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలపై మిల్లు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమ కల సాకారమ వుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.