మహిళా సాధికారత కోసం చర‍్యలు
హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం ఉదయం శాసనసభలో మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మహిళా సంఘాలున్నాయని తెలిపారు. మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు నిధుల కొరత లేదన్నారు. 2012-13 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే మహిళలకు మూడింతల రుణ సౌకర్యం కల్పించామని తెలిపారు.