దొందూ దొందే
ప్రజలను విస్మరించిన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం
ఏఐసీసీ సభ్యులు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఎద్దేవా
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు గుప్పిం చి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దొం దూ దొందేగా మిగిలారని ఏఐసీసీ సభ్యులు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ఏడాది వ్యవధిలోనే ప్రజలు తిరస్కరించే స్థాయికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నైలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మోదీ కాశీపట్నం చూడరబాబు అంటూ మ్యాజిక్కులు చేస్తున్నారేగానీ ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మేలు ఏదీ లేదని అన్నారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నట్లుగా విదేశాల్లో ప్రచారం చేయడం, మేక్ ఇన్ ఇండియా అంటూ అంతా తానే చేస్తున్నట్లుగా వ్యవహరించడం క్షంతవ్యం కాదని అన్నారు. విదేశీపర్యటనల్లో మోదీ ఒక ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
మోదీ విదేశీ పర్యటనల వల్ల భారత్ ఇమేజ్ పెరగకపోగా డామెజ్ అవుతోందని వ్యాఖ్యానించారు. *1.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలకు కోతపెట్టడమేనా గుజరాత్ పాలనను మోదీని నిలదీశారు. శ్రీనగర్‌లో బీజేపీ ప్రభుత్వ మిత్రపక్ష ప్రభుత్వం పాకిస్థాన్ జెండాను ఎగురవేయడమేనా మోదీ దేశభక్తి అంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వాటా నిధులు కోటాయించకుండా మోసిగిస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు, మోదీ ఇద్దరూ రైతు ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారు, ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించాలనే విషయంలో మోదీ, సాధించాలనే అంశంలో బాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రజల ఆదరణ కోల్పోయారని అన్నారు.రైతుల బాగోగులు పట్టించుకోనందునే తెలంగాణలో 900 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు.