ఇకపై స్పష్టంగా ‘ప్రిస్క్రిప్షన్’! | Model Beauty Prescription Perfect Policy issued to doctors | Sakshi
Sakshi News home page

ఇకపై స్పష్టంగా ‘ప్రిస్క్రిప్షన్’!

Published Mon, Mar 3 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

Model Beauty Prescription Perfect Policy issued to doctors

 సాక్షి, ముంబై: డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు అర్థం కాక రోగులకు ఒక్కోసారి మందుల దుకాణదారులు వేరే మందులు ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఫుండ్ అండ్ డ్రగిస్టు (ఎఫ్‌డీ) పరిపాలనా విభాగం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మోడల్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ పెర్ఫెక్ట్ పాలసీని ఎఫ్‌డీ కమిషనర్ మహేష్ జగడే జారీ చేశారు. దీనిమేరకు ఇకపై రోగులకు డాక్టర్లు తాము రాసిచ్చే మందుల పేర్లను స్పష్టంగా రాయాలి. మందులు సాధారణ తెల్లకాగితంపై కాకుండా వారి లెటర్ హెడ్‌పైనే రాసివ్వాల్సి ఉంటుంది. దానిపై రిజిస్ట్రేషన్ సంఖ్య, డాక్టర్ పూర్తిపేరు, చిరునామా కచ్చితంగా ఉండాలి.

మందుల పేర్లు, వాటిని వాడే విధానం (డోస్) ఆంగ్లంలో పెద్ద అక్షరాల్లో స్పష్టం గా రాయాలి. కొన్ని సందర్భాల్లో డాక్టర్ రాసిన రాత అర్థంకాక ఇంట్లో మిగిలిపోయిన మందులే మళ్లీ కొనాల్సి వస్తుంది. ఇంటికి వచ్చాక పరిశీలిస్తే అంత కు ముందు వాడిన మందులే ఉంటాయి. అదే అక్షరాలు స్పష్టంగా రాస్తే ఫలానా మందు, మాత్రలు తమ వద్ద ఉన్నాయని తెలుసుకుని కొనుగోలు చేయడం మానేస్తారు. దీంతో రోగుల డబ్బు వృథా కాకుండా అరికట్టవచ్చని జగడే అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ప్రిస్క్రిప్షన్‌పై స్పష్టంగా రాయని డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

 మందుల చీటిపై డాక్టర్ లేదా క్లినిక్, నర్సింగ్ హోం రిజిస్ట్రేషన్ నంబరు, పూర్తి పేరు, చిరునామ ముద్రించడంవల్ల నకిలీ డాక్టర్లకు కళ్లెం వేయడానికి మార్గం సుగమమైంతుందని జగడే పేర్కొన్నారు. తెల్ల కాగి తంపై మందులు రాసివ్వడంవల్ల ఇది అసలు డాక్టర్ రాసిచ్చారా..? లేక నకిలీ డాక్టర్ రాసిచ్చాడా...? అనేది తేల్చుకోవడం కష్టం కానుంది. దీంతో ఈ మోడల్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఫర్ఫెక్ట్ పాలసీని జారీచేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement