
నా ఆరోగ్యం బాగుంది
బెంగళూరు : తనకు ఆరోగ్యం బాగా లేదంటూ వ్యాపించిన వదంతులు వాస్తవం కాదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని నటుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అన్నారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.