వార్తల్లో తార | Nayanthara in Balakrishna 99th Movie! | Sakshi
Sakshi News home page

వార్తల్లో తార

Published Wed, Jan 28 2015 2:28 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Nayanthara in Balakrishna 99th Movie!

నయనానందానికి చిరునామా నయనతార అంటారు ఆమె అభిమానులు.  అందం, అభినయానికి అదృష్టం తోడైతే నయనతార. అందుకే ఆమె రెండో ఇన్నింగ్‌లోను విజయపరంపర కొనసాగిస్తున్నారు. వ్యక్తిగతంగా నయనతార ఎన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నా వృత్తిపరంగా ఎదుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ స్టార్ హీరోలు ఆమెతో జతకట్టడానికి ఆసక్తి చూపుతుంటే యువ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా ప్రముఖ హీరో సూర్యతోను  యువ హీరో విజయ్ సేతుపతితోను రొమాన్స్ చేస్తున్న నయనతార ఇటీవల ఇళయదళపతి విజయ్‌తో నటించే అవకాశాన్ని నిరాకరించారు ఇంతకుముందు నవ దర్శకుడు అట్లి తెరకెక్కించిన రాజారాణి చిత్రంలో ఆర్యతోను జయ్‌తో ఆడిపాడి విజయాన్ని అందుకున్న నయన ఆ దర్శకుడి తదుపరి చిత్రంలో విజయ్‌కు జంటగా నటించడానికి నో చెప్పడం చర్చనీయాంశమే కదా.

మరో యువ నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన నన్భేండా చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం టుటికోరిన్‌లో సూర్యతో మాస్ స్టెప్స్ వేస్తున్నారు. వీరిద్దరూ జంటగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న మాస్ చిత్రం షూటింగ్ టుటికోరిన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. యువగీత రచయిత మదన్‌కార్గి రాసిన తెరుకుత్తూ తెరుకుత్తు ఇదా కన్నా సిన్నా మాస్ అనే పాటను శోభి నృత్య దర్శకత్వంలో సూర్య, నయనతార, ప్రేమ్‌జీలో యమ మాస్ స్టెప్స్‌తో దుమ్మురేపుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. చిన్న గ్యాప్ తరువాత నయనతారను మళ్లీ టాలీవుడ్ ఆహ్వానించిందనే ప్రచారం జరుగుతోంది. అక్కడే ప్రముఖ నటుడు బాలకృష్ణతో మరోసారి నటించడానికి ఈ బ్యూటీ సిద్ధమవుతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement