నోయిడా: నగరంలో మెట్రో విస్తరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండు మెట్రో ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం అనుమతి మంజూరు చేశారు. దీంతో నగరంలో రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. నోయిడా సిటీ సెంటర్ నుంచి గ్రేటర్ నోయిడా వరకు 29.7 కిమీటర్లు(సెక్టార్ 32), మరొకటి సిటీ సెంటర్ నుంచి సెక్టార్ 62 వరకు 6.7 కిమీ వరకు నిర్మించనున్నారు. సిటీ సెంటర్-సెక్టార్ 62 అనుసంధానానికి రూ. 1.816 కోట్లు నోయిడా-గ్రేటర్ నోయిడా అనుసంధానానికి రూ. 5,064 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను కూడా 2017 వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి...
మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభించాలంటూ నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ సీఈఓ రమారమణ్‌కు సూచించింది. కాగా ఈ రెండు దీర్ఘకాలిక ప్రాజెక్టుల పూర్తి చేయడానికి యూపీ ప్రభుత్వం ఢి ల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( డీఎంఆర్‌సీ)ను సలహా సంస్థగా నియమించుకొంది. మరో మూడు నెలల్లో నోయిడా మెట్రో విస్తరణ పనులు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. బొటానికల్ గార్డెన్- కాళిందీకుంజ్ మెట్రో లింక్ కోసం సుమారు 3.9 కిమీ మార్గానికి రూ. 845 కోట్ల నిధులను ఇప్పటికే కేటాయించిన సంగతి విదితమే. భాగస్వామ్య పద్ధతిలో.. అధికారుల లెక్కల ప్రకారం.. సిటీ సెంటర్-62 మార్గాన్ని యూపీ ప్రభుత్వం-కేంద్ర భాగస్వామ్యంలో అంటే 80-20 శాతం నిధులతో చేపట్టనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా మార్గాన్ని కూడా అదేవిధంగా చేపట్టన్నుట్లు అధికారులు పేర్కొన్నారు.
మెట్రో విస్తరణకు పచ్చజెండా
Published Thu, Oct 2 2014 10:49 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement