పేరుకు మాత్రమే రాయల్ బస్టాండ్. అయితే పేరుకు తగ్గట్టు రాయల్‌గా మాత్రం కనిపించడం లేదు. కనీసం ప్రయాణికులు అక్కడ నిలబడలేనంతగా దుర్వాసన వెదజల్లుతోంది.
దుర్వాసన వెదజల్లుతున్న పాత బస్టాండ్
Published Wed, Oct 30 2013 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
సాక్షి, బళ్లారి : పేరుకు మాత్రమే రాయల్ బస్టాండ్. అయితే పేరుకు తగ్గట్టు రాయల్‌గా మాత్రం కనిపించడం లేదు. కనీసం ప్రయాణికులు అక్కడ నిలబడలేనంతగా దుర్వాసన వెదజల్లుతోంది. అంటే అక్కడ పారిశుద్ధ్య చర్యలు ఏ మాత్రం చేపడుతున్నారో అర్థమవుతుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చిపోయే రాయల్ బస్టాండ్‌లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ బస్టాండ్‌లోకి బళ్లారి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల బస్సులన్నీ వచ్చిపోతుంటాయి. వారం రోజులకొకసారి కూడా బస్టాండ్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు.
బస్టాండ్‌లో మూత్ర విసర్జన చేసే ప్రాంతంలో శుభ్రత లేకపోవడంతో బస్టాండ్ మొత్తం దుర్వాసన వస్తోంది. ఇక బస్సులు వస్తున్నాయంటే జనం మీదకు దుమ్మే కాదు రాళ్లు కూడా ఎగిరి పడతాయనే భయం వేస్తోంది. నీటి కొళాయిల వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. జనం గత్యంతరం లేక ఆ నీటినే సేవిస్తూ రోగాల బారిన పడుతున్నారు. ఈ సందర్భంగా బళ్లారి తాలూకాకు చెందిన మోకా, కక్కబేవినహళ్లి, సిరుగుప్ప తాలూకాకు చెందిన పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ బస్సు వచ్చేంత వరకు ఇక్కడ ఉండాలంటే నరకం కనిపిస్తోందన్నారు. బస్టాండ్‌లో దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రాయల్ బస్టాండ్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement