
సాక్షి, చెన్నై : తేని ప్రభుత్వ కళాశాల క్వారంటైన్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ క్వారంటైన్‌లో ఉన్న వారు ఆందోళకు గురవుతున్నారు. తేని జిల్లా ఆండి పట్టికి చెందిన శశికుమార్ రెండు రోజుల క్రితం ముంబై నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. అయితే తనకు ఎలాంటి వైరస్ లేనప్పుడు ఎందుకు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులను నిలదీశాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం శశికుమార్ క్వారంటైన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణ సమాచారంతో అధికారులు ఆందోళనలో పడ్డారు. క్వారంటైన్‌కు తరలించారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా మరెదేని కారణాలు ఉన్నాయా.? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ముందు కరోనా నిర్ధారణ పరీక్షకు చర్యలు తీసుకున్నారు.
(కరోనా.. కమ్మేస్తోంది!)
Comments
Please login to add a commentAdd a comment