‘సెక్రటేరియట్‌కు టీఆర్‌ఎస్ బోర్డు పెట్టుకోండి’
హైదరాబాద్: సెక్రటేరియట్ వద్ద పోలీసులు వ్యవహరించిన దారుణంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల పట్ల పోలీసుల దుందుడుకు వైఖరిపై సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్‌కు టీఆర్‌ఎస్ బోర్డు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల నేతలను కలిసే అవకాశం కూడా సీఎం ఇవ్వటం లేదని ఆరోపించారు. అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.