నగర పరిసర ప్రాంతాల్లోని పలు అష్టవినాయక మందిరాల్లో భక్తుల సౌకర్యార్థం కాయిన్ బాక్స్ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు.
పింప్రి, న్యూస్‌లైన్: నగర పరిసర ప్రాంతాల్లోని పలు అష్టవినాయక మందిరాల్లో భక్తుల సౌకర్యార్థం కాయిన్ బాక్స్ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. మోర్‌గావ్, తేవూర్, సిద్ధటేక్‌ల్లోని మూడు గణపతి మందిరాల్లో ఈ ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన ప్రముఖులు సురేంద్రదేవ్ మహారాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మందిరాల్లో తరచూ జాతరలు, ఉత్సవాలు జరుగుతుంటాయని, దీంతో అష్ట వినాయక దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారన్నారు. అయితే ఈ మందిరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో తాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
తాగేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మినరల్ వాటర్ బాటిల్‌లను కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని ఇష్టానుసారం పడేస్తుండటంతో అవి ఆయా మందిరాల పరిసరాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయన్నారు. దీంతో చిం చ్‌వడ్ దేవస్థానం ట్రస్టు ముందుకు వచ్చి అతి చౌక ధరకే భక్తులకు పరిశుభ్ర తాగునీటిని అందిస్తోందన్నారు. మందిర పరిసరాలలో ఒక రూపాయి కాయి న్ బాక్సులో వేస్తే అర లీటరు నీటిని పొందే యం త్రాలను అమర్చారన్నారు. ఇదిలాఉండగా, ప్రభు త్వ అనుమతి పొందిన క్లోరిన్ డయాక్సైడ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ దేవాలయాల్లో ఒక గంట వ్యవధిలో 200 లీటర్ల తాగునీరు పొందే వెసులుబాటు కల్పించారు.
అంతేకాకుండా ఇక్కడి గ్రామస్తుల కోసం ఒక గంటలో వెయ్యి లీటర్ల నీటిని అందించడానికి ‘మ్యాక్స్ వాటర్ రెమిడిజన్’ ట్రస్టు కు సహకారాన్ని అంది స్తోంది. కాగా, గతంలో దేవు డి దర్శనం నిమిత్తం వచ్చే ప్రతి భక్తుడు తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇకనుంచి అతి చౌక ధరకే నీటిని పొందే ఏర్పాటు చేశారని స్థానికులు, భక్తులు ఆనందం వ్యక్తం చేశా రు. కాగా, అష్టవినాయక మందిరాల్లోని ట్రస్టు డెరైక్టర్లు శైలేష్ వాఘ్, సతీష్ గడాలే, విజయ్ సంపగావ్‌కర్ ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.