
ఐఫోన్ 6 కోసం బారులు
యువతను విశేషంగా ఆకర్షిస్తున్న ఐఫోన్ 6, 6+ అమ్మకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ఊఫోన్ ఆథరైజ్డ్ షోరూంలు ఐఫోన్ ప్రియులతో కిటకిటలాడాయి. ఐఫోన్6, 6+ సిరీస్‌లు లిమిడెట్ వర్షన్‌లో అందుబాటులో ఉండటంతో వాటిని తమ సొంతం చేసుకునేందుకు అవుట్‌లెట్‌ల వద్ద యువత బారులు తీరారు. సరికొత్త సిరీస్‌లను సొంతం చేసుకునేందుకుగాను యువతీ యువకులతోపాటు అన్ని వర్గాల వారు ఆసక్తి చూపడం గమనార్హం. వినియోగదారుల సౌకర్యార్థం నిర్వాహకులు గురువారం రాత్రంతా తమతమ షో రూంలను తెరిచే ఉంచారు.
- సాక్షి,బెంగళూరు