
బెంగళూరులో బళ్లాలదేవ
బొమ్మనహళ్లి : బాహుబలి–2 సినిమాలో భల్లాల దేవతో ప్రత్యేక గుర్తింపు సాధించిన నటుడు రాణా శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన సందర్భంగా ఆయనకు ప్రభాస్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాణాకు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక గౌరవ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, అధ్యక్షుడు అశిష్ సభ్యులు స్వాగతం పలికి మైసూరు పేటెతో సన్మానించారు.