ఆర్‌బీఐ నుంచి ఏపీకి 2500 కోట్లు
అమరావతి: నోట్ల రద్దుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు కాస్త ఊరటనిచ్చే చర్య చేపట్టింది. రిజర్వ్ బ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 2500 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో 2000 కోట్లు రూ. 2000 రూపాయల నోట్లు, 500 కోట్లు రూ.500 నోట్లు ఉన్నాయి.
జిల్లాల వారీగా విడుదలైన డబ్బు వివరాలు..
శ్రీకాకుళం రూ.204 కోట్లు
విజయనగరం రూ.180 కోట్లు
విశాఖపట్నం రూ. 380 కోట్లు
తూర్పుగోదావరి రూ. 296 కోట్లు
పశ్చిమగోదావరి రూ. 250 కోట్లు
కృష్ణా రూ.306 కోట్లు
గుంటూరు రూ.344 కోట్లు
ప్రకాశం రూ. 220 కోట్లు
కర్నూలు రూ.148 కోట్లు
అనంతపురం రూ. 172 కోట్లు
ఈ జిల్లాలకు మొత్తం.. రూ.2500 కోట్లు విడుదలయ్యాయి.
► స్థానికంగా ఉన్న రూ. 503 కోట్లు.. నెల్లూరు (రూ.154.40 కోట్లు), కడప (రూ.164.40 కోట్లు), చిత్తూరు (రూ.184.40 కోట్లు) జిల్లాలకు కేటాయించడం జరిగింది.