కాంచీపురం: కంచి ఏకాంబరనాధర్ ఆలయంలో ఉన్న రాజులకాలం నాటి విగ్రహంలో బంగారం ఎందుకులేదని తెలుసుకోవడం కో సం అధికారులు ఆదివారం ఆలయానికి వచ్చి పరిశోధనలు చేశారు. ఆలయాల నగరంగా పేరొందిన కాంచీపురంలో పురాతన కాలం నాటి ఆలయాల్లో ఏకాంబరనాధర్ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉత్సవమూర్తి విగ్రహంలో బంగారం లేదని తెలిసింది. దీంతో ఉత్సవ మూర్తి విగ్రహంపై పలు సందేహాలు వెల్లడవుతున్నాయి.
అదేవిధంగా కొత్తగా తయారు చేయించిన సోమసుందరం ఉత్సవ మూర్తి విగ్రహం కోసం పొందిన విరాళంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లడైయ్యాయి. రాజుల కాలం నాటి విగ్రహాల్లో బంగారు లేకపోవడం, కొత్త ఉత్సవ మూర్తి విగ్రహం తయారీలో అక్రమాలు వంటి వాటితో భక్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థితిలో ఆ విగ్రహం ఎన్నేళ్ల కాలం నాటిది, అందులో ఎందుకు బంగారం లేదని తెలుసుకోవడం కోసం విగ్రహాన్ని అక్రమ రవాణా నిరోదక విభాగం ఐ జీ పొన్ మాణిక్యవేల్ అధ్యక్షతన అధికారులు ఆదివారం పరిశీలన చేశా రు. అధికారులు, ఆలయ నిర్వాహకులు, డీఎస్‌పీ శివశంకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment