నిఘా వలయం
Published Tue, Jan 21 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
సంఘ విద్రోహశక్తుల కుట్ర భగ్నం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని నిఘా వలయంలోకి తెచ్చింది. చెన్నైలో భద్రత కోసం 18 వేల మందిని మోహరించారు. విమానాశ్రయాల్లో ఏడు అంచెల భద్రత కల్పించారు. రిపబ్లిక్ డే సందర్భంగా తీవ్రవాదుల ముప్పు ఉండొచ్చన్న అంచనాలతో ఈ ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. సోమవారం నుంచి మెరీనా తీరంలో రిహార్సల్స్ ఆరంభమయ్యూయి.
సాక్షి, చెన్నై:రిపబ్లిక్ డే వేడుకలకు చెన్నై నగరం ముస్తాబు అవుతోంది. కేంద్రం నుంచి వస్తున్న హెచ్చరికలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ర్ట పోలీసు యంత్రాంగం నిఘాను మరింత పటిష్ట వంతం చేస్తూ అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ రామానుజం ఆదేశాలతో అన్ని జిల్లాల్లోను తనిఖీలు మంగళవారం నుంచి ముమ్మరం చేయనున్నారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పెంచనున్నారు. ప్రజలు తమ తనిఖీలకు సహకరించాలని పోలీసులు కోరుతున్నా రు. విమానాశ్రయాలకు అయితే, ఐదు అంచెల భద్రతను సోమవారం కల్పించారు. మంగళవారం నుంచి ఏడు అంచెల భద్రత కల్పించేందుకు నిర్ణయించారు.
రాష్ట్ర రాజధాని నగరం తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న దృష్ట్యా, మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 18 వేల మంది సిబ్బందిని భద్రతా విధుల్లోకి దించారు. మంగళవారం నుంచి రాత్రుల్లో అన్ని మార్గాల్లోను వాహనాల తనిఖీలు వేగవంతం కానున్నాయి. మీనంబాక్కం విమానాశ్రయ పరిసరాల్లో భద్రతా ఆంక్షలు విధించారు. విమానాశ్రయం ఆవరణల్లో కేంద్ర బలగాలు, వెలుపల స్థానిక పోలీసులు భద్రతా విధుల్లో నియమితులయ్యూరు. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో మఫ్టీలో సిబ్బంది రంగంలోకి దిగనున్నారు. ప్రశాంత పూరిత వాతావరణంలో రిపబ్లిక్ డే వేడుకలు ముగిసే రీతిలో రాష్ట్రాన్ని నిఘా వలయంలోకి తెచ్చి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు: చెన్నై మెరీనా తీరం రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతోంది. వేడుకలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు పనులను వేగవంతం చేశారు. మెరీనా తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
గాంధీ విగ్రహం వద్ద వేదిక ఏర్పాటు, ఆ విగ్రహానికి మెరుగులుదిద్దే పనులు జరుగుతున్నారుు. ఈ వేడుకల్లో గవర్నర్ రోశయ్యతో పాటుగా సీఎం జయలలిత పాల్గొననున్న దృష్ట్యా, మరో రెండు రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నారుు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. జనాకర్షణ దిశగా సరికొత్త తరహాలో శకటాలు రూపుదిద్దుకుంటున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ ఆరంభమయ్యూరుు. త్రివర్ణ దళాలు, రాష్ట్ర పోలీసులు కవాతులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ విద్యార్థుల నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాల రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.
నిఘా వలయం వార్తకు కలుపుకోగలరు
తూటాతో యువకుడి పట్టి వేత: ఐదంచెల భద్రతను అధిగమించి ఓ యువకుడు సోమవారం మీనంబాక్కం విమానాశ్రయంలోకి తుపాకీ తూటాతో ప్రవేశించి అక్కడి భద్రతను ప్రశ్నార్థకం చేశాడు. మీనంబాక్కంలో కట్టుదిట్టమైన భద్రత చేశారు. చెన్నై నుంచి ఉదయం అండమాన్‌కు బయలు దేరడానికి విమానం సిద్ధం అయింది. ఉన్నట్టుండి భద్రతా సిబ్బంది ఆ విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇందులో అండమాన్‌కు ప్రయాణిస్తున్న ఓ యువకుడి సూట్ కేసులో తుపాకీ తూటా ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. అతడిని అదుపులోకి తీసుకోగా పొంతన లేని సమాధానం ఇచ్చాడు. చివరకు క్యూబ్రాంచ్‌కు అప్పగించారు. వారి విచారణలో బెంగళూరులోని ఓ ప్రవేటు కళాశాలలో చదువుకంటున్న ఆర్కిష్(22)గా ఆ యువకుడిని గుర్తించారు. 7.62 ఎంఎం తూటాను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement