-కార్పొరేషన్ నిర్ణయం
- మరి కొద్ది రోజుల్లో పంపిణీ
సాక్షి, చెన్నై : మినరల్ వాటర్ క్యాన్ వ్యాపారంలోకి చెన్నై కార్పొరేషన్ అడుగు పెట్టనున్నది. రూ.పదికే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను నగర వాసులకు అందించేందుకు నిర్ణయించింది. మరి కొద్ది రోజుల్లో నగరంలోని పదిహేను మండల కేంద్రాల ద్వారా ఈ క్యాన్ల పంపిణీ సాగబోతున్నది. రోజుకు ఎనిమిది లక్షల క్యాన్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో తాగు నీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మినహా తక్కిన పట్టణ, నగరాల్లో వాట ర్‌క్యాన్ల మీద ప్రజలు ఆధార పడక తప్ప డం లేదు. ఆ దిశగా రాజధాని నగరం , సబర్బన్‌ల్లో వాటార్ క్యాన్ కొనుగోలు తప్పని సరి.
కొన్ని ఇళ్లల్లో వాటర్ ఫ్యూరీ లు ఉన్నా, మిగిలిన వాళ్లు వాటర్ క్యా న్లను కొనాల్సిందే. దీంతో నగర, శివారుల్లో కొకొల్లలుగా మినరల్ వాటర్ క్యాన్ల పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉన్నాయి. 20 లీటర్ల క్యాన్ నీటిని రూ. ముప్పైకు పైగానే విక్రయం సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇటీవలి కాలంగా సరికొత్త పోకడలతో ముందుకు సాగుతున్న చెన్నై కార్పొరేషన్ పాలక మండలి తాజాగా వాటర్ క్యాన్ల మీద దృష్టి పెట్టి ఉన్నది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ మెడికల్స్, అమ్మ కూరగాయల దుకాణం అంటూ ముందుకు సాగుతున్న కార్పొరేషన్ పాలక మండలి, తక్కువ ధరకే వాటర్‌క్యాన్ల విక్రయానికి చర్యలు చేపట్టింది.
రూ. 10కే 20 లీటర్ల క్యాన్ : ఇటీవల వాటర్ క్యాన్ల పంపిణీ పరిశ్రమలతో మే యర్ సైదై దురైస్వామి సమీక్షించినట్టు సమాచారం. ధరలు తగ్గించాలని ఆయ న సూచించినా ఆ యాజమాన్యాలు తలొగ్గలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విద్యుత్ చార్జీల మేరకు ఒ క్యాన్‌లో నీటి ని నింపడానికి తమకు రూ. ఆరు నుంచి ఏడు రూపాయల మేరకు ఖర్చు అవుతోందని, ఇక రవాణా, సిబ్బంది చార్జీలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఆ యాజమన్యాలు తలొగ్గని దృష్ట్యా, ఇక, తామే స్వయంగా వా టర్ క్యాన్ల విక్రయాలకు శ్రీకారం చుట్టేం దుకు మేయర్ నిర్ణయించి ఉన్నారు. నగరంలో రెండు వందల వార్డులు ఉన్నా యి.
ఈ వార్డుల్ని పదిహేను మండలాలుగా విభజించి ఉన్నారు. ప్రతి మండలంలోనూ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల వేదికగా వాటర్ క్యా న్ల విక్రయాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు గాను రూ. పదహారు కోట్లను కేటాయించి ఉన్నా రు. రోజుకు ఎనిమిది లక్షల వాటర్ క్యాన్లను పంపిణీ, విక్రయానికి చర్యలు చేపట్టి ఉన్నారు. అలాగే, 20 లీటర్ల వాట ర్ క్యాన్ ధర రూ. పదిగా నిర్ణయించడంతో పాటుగా మరి కొద్ది రోజుల్లో మండల కేంద్రాల్లోని కౌంటర్ల ద్వారా వాటర్ క్యాన్ల వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు కార్పొరేషన్ సిద్ధం కావడం విశేషం. అదే సమయంలో ఈ వాటర్ క్యాన్లకు ‘అమ్మ’ పేరు పెట్టే అవకాశాలు ఎక్కువే.
రూ.10కే 20 లీటర్ల మినరల్ వాటర్
Published Thu, Jul 30 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement