భూకంపం ఇతివృత్తంగా శాన్ ఆండ్రియాస్ | 'San Andreas' Stars on Real-life Earthquakes | Sakshi
Sakshi News home page

భూకంపం ఇతివృత్తంగా శాన్ ఆండ్రియాస్

Published Fri, May 22 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

భూకంపం ఇతివృత్తంగా  శాన్ ఆండ్రియాస్

భూకంపం ఇతివృత్తంగా శాన్ ఆండ్రియాస్

 భూకంపాల విళయ తాండవం ఎలా ఉంటుందో ఈ మధ్య నేపాల్‌లో సంభవించిన సంఘటనను ప్రత్యక్షంగా చూశాం. అలాంటి భయానక భూకంపం ఇతి వృత్తం తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం శాన్ ఆండ్రియాస్. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్స్ బ్రదర్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇది.అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపాందిన ఈ చిత్రాన్ని బాడ్ పయోటక్ దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే మహా నగరం కాలిపోర్నియా.అత్యధిక జనాభా నివశించే ఆ నగరంలో సంభవించిన భారీ భూకంప బీభత్సమే శాన్ ఆండ్రియాస్ చిత్రం .
 
 దక్షిణ కాలిఫోర్నియాలోని భూకంప పరిశోధన సంస్థలో ముఖ్య అధికారి, ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు,హెలికాప్టర్ పెలైట్ భూకంప బాధితుల్ని ఎలా రక్షించే ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది? పలు ఉత్కంఠ భరిత సన్నివేశాల రూపకల్పనగా శాన్ ఆండ్రియాస్ చిత్రం ఉంటుందని వార్నర్ బ్రదర్స్ నిర్వాహకులు అన్నారు. ది మమ్మి రిటర్న్స్,ది స్కూర్పింన్ కింగ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-6,7 సిరీస్ చిత్రాల ఫేమ్ డాని జాన్సన్ హీరోగా నటించిన  ఈచిత్రం  29న ఆంగ్లం, తమిళ భాషల్లో విడుదల కానుంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement