సాక్షి, ముంబై: ఈ ఏడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ పది జిల్లాల్లో ఇప్పటికీ కరు వు ఛాయలు మాత్రం తొలగిపోవడం లేదు. చాలా గ్రామాలకు ఇంకా ట్యాంకర్లతోనే నీటి సరఫరా జరుగుతోంది. గత సంవత్సరం వర్షాలు అనుకున్నంతమేర వర్షాలు కురవకపోవడంతో మరఠ్వాడాలోని అనేక గ్రామాల్లో వేసవిలో కరువు తాండవించింది. తాగేందుకు నీరు లేక వందలాది గ్రామాల ప్రజలు వలస పోయారు. పశువులకు మేత, నీరు దొరకడం కష్టతరంగా మారింది. అదృష్టవశాత్తూ ఈ ఏడు ఆరంభం నుంచే వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిం చాయి.
అయినప్పటికీ ధులే, పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, బుల్డాణ జిల్లాల్లోని అనేక గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిస్తున్నారు. నీటిసరఫరా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 823 గ్రామాలు, 4,320 కుగ్రామాలకు సుమారు 1,042 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇందులో 99 ప్రభుత్వానికి చెందినవి, 943 ప్రైవేటు యజమానులకు చెందిన ట్యాంకర్లు ఉన్నాయి. ఈ ఏడు 30 జిల్లాల్లో వందశాతం కంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జలాశయాల్లోకి దాదాపు 78 శాతం నీరు వచ్చి చేరింది. కొన్ని జిల్లా ల్లో సంతృస్తస్థాయిలో, మరికొన్ని జిల్లాల్లో తక్కువ వర్షాలు కురిశాయి.
దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణంగా జూన్ ఒకటి నుంచి సెప్టెం బరు వర కు దాదాపు 159.9 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. అయితే ఈ సారి జూన్ నుంచి ఆగస్టు 31 వరకే 1,226.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి 125 శాతం వర్షపాతం నమోదయిది. షోలాపూర్, సాంగ్లీ, ఔరంగాబాద్, బీడ్ జిల్లాల్లో 76-100 శాతం వర్షం కురిసింది. ఉస్మానాబాద్ జిల్లాలో 51-76 శాతం వర్షం కురిసింది.
రాష్ట్రంలో 84 పెద్ద, 224 సాధారణ, 2,156 చిన్న నీటి డ్యాములు ఉన్నా యి. ఇలా మొత్తం 2,464 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవిగాక మరో 16 డ్యాములు ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు, డ్యాములతో కలిపి 37,335 మిలి యన్ ఘనమీటర్ల నీరు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 29,179 మిలియన్ ఘనమీటర్ల నీరు మాత్రమే ఉంది. శాతాలవారీగా చూస్తే 78 శాతం నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో ఈ నిల్వ లు రోజురోజుకూ తుగ్గుముఖం పడుతున్నాయి. దీన్ని బట్టి వచ్చే సంవత్సరం వేసవి కాలంలో కరువు పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొనసాగనున్న దాణాకేంద్రాలు
ఇప్పటికీ కరువు పరిస్థితులు తొలగిపోకపోవడంతో 13 తాలుకాల్లోని పశుదాణా కేంద్రాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బారామతి, ఇందాపూర్, దౌండ్, ఫాల్తన్, మన్, ఖటావో, జాట్, అత్పడి, కవాటే మహాకాల్, టాస్‌గావ్, మంగళ్‌వేదా, పండర్‌పూర్ తాలుకాల్లో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటి లో 1.75 లక్షల పశువులకు దాణా సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి పెరుగుతుండడంతో ట్యాంకర్ల సంఖ్యనూ పెంచామని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చంద్రపూర్, గడ్చిరోలీ జిల్లాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలా ల్లో పూర్తిగా నీరు చేరడం వల్ల రెండో పంట కూడా సాధ్యం కాకపోవచ్చని రైతులు అంటున్నారు.
అయితే వర్షాల కారణంగా నష్టపోయిన పత్తిరైతులకు హెక్టారుకు రూ.ఐదువేలు, సోయాబీన్ రైతులకు హెక్టారుకు రూ.ఏడువేల చొప్పున పరిహా రం చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. పంటలు పూర్తిగా కొట్టుకుపోతే మాత్రం రూ.15 వేలు, రూ.20 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇంత తక్కువ నష్టపరిహారం ఇవ్వడమంటే తమను అవమానించడమేనని రైతులు అంటున్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రభుత్వం వ్యవసాయా న్ని అపహాస్యం చే స్తోందని చంద్రపూర్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో ప్రహార్ పేర్కొంది.
కరువు దరువు
Published Mon, Sep 9 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
Advertisement
Advertisement