village people
-
మా ఊరికి మద్యం షాపు వద్దు!
తిరుపతి అర్బన్: తమ ఊరికి మద్యం షాపు వద్దంటూ ఈనెల 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి రూరల్ మండలం పరిధిలోని సాయినగర్ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామసభలో ప్రజలు తీర్మానించారు. ఈ మేరకు సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డీవీ రమణ బుధవారం కలెక్టరేట్లోని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంతోపాటు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవికి వినతిపత్రం అందజేశారు.డీవీ రమణ మాట్లాడుతూ గతంలో 2014–15 సంవత్సరంలో ఒకసారి సాయినగర్ గ్రామపంచాయతీ పరిధిలోని జయనగర్‌లో మద్యం షాపు ఏర్పాటు చేశారన్నారు. ఆ సమయంలో స్థానిక ప్రజలందరూ అనేక రోజులపాటు సదరు మద్యం షాపు తొలగించే వరకు ప్రజా ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. గ్రామసభలో తీర్మానం మేరకు మద్యం షాపులు వద్దని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించామని తెలిపారు. తమ గ్రామపరిధిలో నూతన మద్యం షాపులు ఏర్పాటు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ప్రజల్లేని ఊరు.. తిమ్మాపూర్
నల్గొండ: రికార్డుల్లో రెవెన్యూ గ్రామమైన తిమ్మాపూర్‌లో నేడు ఒక్కరూ నివాసం లేకపోవడంతో ప్రజలు లేని పల్లెగా మారింది. 70 సంవత్సరాల క్రితం వ్యవసాయబావుల వద్ద ఐదు కుటుంబాలు (వంగాల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీరాంరెడ్డి, మధూసరెడ్డి, కుమ్మరి నర్సింహ) ఇళ్లు నిర్మించుకొని 60 సంవత్సరాల పాటు తిమ్మాపూర్ గ్రామంలో జీవనం సాగించారు. కాలక్రమంలో అంటువ్యాధులు ప్రబలి కొందరు ఊరు వదిలి పోగా మరికొందరు ఉపాధిని వెతుక్కుంటూ నెమ్మాని, పరడ, హైదరాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఏపీ లింగోటం, నార్కట్‌పల్లి, చిట్యాల, వెంకటేశ్వర్లబావి, శేరిబావి వంటి గ్రామాలకు వెళ్లి నివసిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పాడుబడిన ఇళ్లు, బావులు, పశువుల కొట్టాలు, గోడలు, పంట పొలాలు మాత్రమే దర్శనమిస్తాయి. ఇలాంటి గ్రామాన్ని బేచిరాక్గావ్ (దీపం వెలగని గ్రామం)గా పిలుస్తుంటారు. గతంలో ఐదు కుటుంబాలు నివాసం.. 2011 జనాభా లెక్కల ప్రకారం తిమ్మాపూర్ గ్రామంలో 5 కుటుంబాలు నివసించేవి. గ్రామం మొత్తం జనాభా 20 మంది వారిలో 12 మంది పురుషులు, 8 మంది సీ్త్రలు ఉన్నారు. వీరిలో 9 మంది కూలీ పనులు చేసేవారిలో 8 మంది పురుషులు, ఒక సీ్త్ర ఉన్నారు. 55.56 శాతం అక్షరాస్యత కలిగిన గ్రామంలో ఇద్దరు మాత్రమే ఓటర్లు ఉండటం విశేషం. ఆంజనేయస్వామి విగ్రహం తరలింపు తిమ్మాపూర్‌లో గల ఆంజనేయస్వామి దేవాలయంలో గ్రామ ప్రజలు ఆంజనేయస్వామికి పూజలు చేసేవారు. అంటు వ్యాధులు ప్రబలడంతో గ్రామస్తులంతా ఒకరు తరువాత ఒకరు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో గ్రామమంతా ఖాళీ అయ్యింది. దీంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం గ్రామస్తులు తీసుకెళ్లి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించుకున్నారు. తిమ్మాపూర్ పరిధిలో 500 ఎకరాలు.. కట్టంగూర్ మండంలంలో 22 గ్రామ పంచాయతీలకు గాను 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తిమ్మాపూర్. ఈ ఊరి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో భూములు ఉన్నాయి. కానీ ఆ ఊరిలో వరిసాగు, చెట్లు, పక్షులు, గేదెలు, పశువులు, భూమి తప్ప జనం కనిపించరు. ఆ గ్రామం పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తారు. వ్యవసాయ భూమి సాగు వివరాలు, ఇతర విషయాలు రికార్డుల్లో నమోదవుతాయి. గ్రామం రెవెన్యూ పరిధి కావడంతో సంబంధిత అధికారులే భూములను పర్యవేక్షిస్తారు. తిమ్మాపూర్ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 59లో 500 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సుమారు 180 మంది రైతులు పత్తి, వరి, పెసర, కంది పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంగా పచ్చని పొలాల మద్య ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంది. నెమ్మానిలో ఉంటున్నాం పరడ, నెమ్మాని గ్రామాల మధ్య తిమ్మాపూర్ ఉంటుంది. అక్కడే ఐదు కుటుంబాలు నివసించేవి. చుట్టూ చెట్లు కొండలతో అడవిని తలపించేలా ఉండేది. మా తాత, నాన్న అందరం 60 సంవత్సరాల పాటు జీవనం సాగించాం. ఇప్పుడు నార్కట్‌పల్లి మండలం నెమ్మానిలో నివాసం ఉంటున్నాం. పాస్ పుస్తకాల్లో రెవెన్యూ గ్రామం తిమ్మాపూర్, కట్టంగూర్ మండలం అని ఉండడంతో నార్కట్‌పల్లిలో ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది అవుతోంది. – వంగాల అనంతరెడ్డి, రైతు, నెమ్మాని -
పల్లె జనం పట్టణ బాట
సాక్షి, అమరావతి: పల్లె జనం పట్టణ బాట పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు. చదువుకొని, నైపుణ్యం కలిగిన వారు ఉద్యోగాలు చేసుకొంటూ పట్టణాల పరిధిలో నివాసం ఉంటుంటే.. సాంకేతిక నైపుణ్యాలు లేని వారు ఏదో ఒక పని చేసుకొంటూ పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో అంతర్భాగమవుతున్నాయి. తద్వారా పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా స్థానిక సంస్థలకు పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే వివిధ పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణకు బాటలు వేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. పేదరికం తగ్గుతుందనడానికి ఇదో సూచన భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారిందని, ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పట్టణీకరణను సంతరించుకుంటున్నాయని, దీనివల్ల పట్టణీకరణ మరింత పెరుగుతుందని అభిప్రాయపడింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాలు విస్తరిస్తాయని తెలిపింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ఎజెండా అయిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్–2030 (ఎస్డీజీ) కూడా ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నట్టు పేర్కొంది. జీడీపీలో 60 శాతం పట్టణాలదే దేశంలో 10 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 53కు చేరుకుంటాయని నివేదిక తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్లు (37.71 కోట్ల మంది) అంటే దేశ జనాభాలో 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2031 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా. అంతేగాక పట్టణాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతం కంటే ఎక్కవ వాటాను పట్టణ జనాభా అందిస్తుండడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. 2001లో దేశంలో 5,161 పట్టణాలు ఉండగా.. 2011 నాటికి వాటి సంఖ్య 7,933కి పెరిగిందని, 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుందని పేర్కొంది. కాగా భారతదేశ జనాభా 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో అంతర్భాగమైన స్వతంత్ర జనాభా, ఆరోగ్య పరిశోధన కేంద్రం ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం మరో 30 ఏళ్లకు భారతదేశ పట్టణ జనాభా 82 కోట్లకు చేరుకుంటుంది. పట్టణాల ముందు సవాళ్లూ ఉన్నాయ్.. వేగవంతమైన పట్టణీకరణ తాగు నీరు, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా వంటి సేవలను మెరుగుపరచడం వంటి అనేక సవాళ్లను స్థానిక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు పట్టణ పేదరికాన్ని తగ్గించడం, మురికివాడల వ్యాప్తి నివారణ వంటివీ చేపట్టాల్సి ఉంటుంది. పాక్షిక పట్టణీకరణ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. నీటి సరఫరా, మురుగునీరు, డ్రైనేజీ నెట్వర్క్, ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు, రహదారులు, ప్రజా రవాణా, వీధి దీపాలు, పాదచారుల మార్గాలు వంటి ప్రజా భద్రతా వ్యవస్థలు వంటి ప్రాథమిక సేవలు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా భూమి, నివాస సౌకర్యాలు కల్పించడం సాధ్యపడటంలేదని తేల్చింది. -
బ్యాంకు మాజీ ఉన్నతాధికారి కృషి.. పైపులైన్ల పంట!
వ్యవసాయంపై ఉన్న మమకారం ఆయనను తిరిగి సొంతూరికి తీసుకొచ్చింది. పదెకరాల నల్లరేగడి భూమిని సాగు చేసుకుంటూ తమ ఊళ్లో విశ్రాంత జీవితం గడుపుదామని ఆయన నిర్ణయించుకొని ఉండకపోతే.. సాగు నీరు లేక అల్లాడుతున్న ఆ ఊరు పొలాల్లో హంద్రీ నీవా కాలువ నీరు జల జలా పారేదే కాదు. రాజకీయాలకు అతీతంగా రైతులను కూడగట్టి పట్టుదలతో ఆయన సాధించిన వరుస విజయాల గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరమూ వచ్చేది కాదు! ఆయన పేరు సూగూరు వెంకటేశ్వరరెడ్డి. రైతు బిడ్డ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఆయన స్వగ్రామం. వ్యవసాయంలో బీఎస్సీ పట్టా తీసుకున్న ఆయన భారతీయ స్టేట్ బ్యాంక్‌లో వ్యవసాయ క్షేత్ర అధికారిగా ఉద్యోగంలో చేరారు. 35 ఏళ్ల తర్వాత 2018లో ఏజీఎంగా ఉద్యోగ విరమణ చేసి.. సొంతూళ్లో సేద్యం చేస్తూ వ్యవసాయానికి జవసత్వాలు చేకూర్చుతున్నారు. ? ఉమ్మడిగా భూగర్భ పైపులైన్లు మల్లెపల్లి గ్రామానికి 2.5 కి. మీ. దూరం నుంచి హంద్రీ నీవా – సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువ వెళ్తుంది. వర్షాలు కురిస్తే కాలువలో ఏడాది పొడవుగా నీళ్లు పారుతుంటాయి. కానీ, గ్రామ పొలాలకు ఈ నీరు పారదు. వెంకటేశ్వరరెడ్డి పైపులైను గురించి ఆలోచించారు. గ్రామ రాజకీయాలను, రైతుల్లో అనైక్యతను అధిగమించి 30 మంది రైతులను ఏకం చేశారు. భూగర్భ పైపులైను నిర్మించి డీజిల్ పంపుల ద్వారా కాలువ నీటిని పొలాల్లో పారించారు. మీటరు లోతులో, 5–6 అడుగుల వెడల్పున ఉమ్మడిగా కందకం తవ్వి.. రైతులు ఎవరికి వారు తమ పీవీసీ పైపులను ఈ కందకంలో పక్క పక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి డీజిల్ ఇంజన్లను వాళ్లే ఏర్పాటు చేసుకొని, ఎవరికి కావాల్సినప్పుడు నీటిని వారు తోడుకుంటున్నారు. ఫామ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసుకొని డ్రిప్‌లో, స్ప్రింక్లర్ల ద్వారా పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ స్కీము అమలయ్యేనా? అన్న అనుమానంతో తొలుత ఏ ఇతర రైతులూ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. వెంకటేశ్వరరెడ్డి పట్టుదలతో తనే రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టి, పైపులైను నిర్మించి నీటిని పొలాలకు పారించారు. సొంత పూచీకత్తుపై ప్రతి రైతు పేరిట రూ. లక్ష బ్యాంకు రుణం ఏర్పాటు చేయించి.. తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము 4 నెలల తర్వాత తిరిగి తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆ విధంగా తమ గ్రామ పొలాల్లో ఆరుతడి పంటలకు రక్షక తడులు ఇవ్వడానికి నీటి భద్రత చేకూరిందని వెంకటేశ్వరరెడ్డి సంబరంగా చెబుతుంటారు. ఆ తర్వాత గ్రామంలో ఇతర రైతులు కూడా అనుసరించారు. సుమారు వంద మంది రైతులు దశల వారీగా మరో 8 భూగర్భ పైపులైన్ స్కీముల ద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత కల్పించుకున్నారని ఆయన తెలిపారు. వెంకటేశ్వరరెడ్డి పాడి గేదెల ఫారం ఎకరానికి రూ. 5–6 వేల ఖర్చు రేగడి నేలలు కావటాన మూడు నాలుగు వారాలు వర్షం మొహం చాటేసినప్పుడు పంటలను రైతులు కాలువ నీటితో రక్షక తడులు అందించి రక్షించుకుంటున్నారు. ఖరీఫ్ కాలంలో వర్షాభావ పరిస్థితులను బట్టి 1–2 సార్లు, రబీలో 2–3 సార్లు నీటిని సొంత ఖర్చుతో తోడుకుంటున్నారు. ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 5–6 వేల వరకు డీజిల్ ఖర్చవుతున్నదని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కొందరు రైతులు వేసవిలో కూరగాయలను సైతం మూడో పంటగా సాగు చేసుకొని మంచి ఆదాయం గడిస్తున్నారు. నీటి భద్రత వల్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. పత్తి, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతుల ఆదాయం పెరిగింది. భూమి విలువ పెరగడంతో పాటు కౌళ్లు రెట్టింపయ్యాయి. 25 ఎకరాల దేవాలయ భూములకు పైపులైను ద్వారా కాలువ నీటిని తెప్పించేందుకు సొంత డబ్బు రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మల్లెపల్లె ప్రాథమిక పాఠశాల, అల్లుగుండు ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ట్యాంకులు విరాళంగా ఇచ్చారు. సంఘటితమైతే రైతులకు మేలు జరుగుతుందని నమ్మే వెంకటేశ్వరరెడ్డి ‘నాగలి రైతు ఉత్పత్తిదారుల సంఘం’ను ఏర్పాటు చేశారు వెంకటేశ్వరరెడ్డి. ప్రస్తుతం ఇందులో 40 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు వెంకటేశ్వరరెడ్డి రుణం తీర్చుకోవటం కోసమే ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు! పైపులైన్ నీటితో సాగవుతున్న వేరుశనగ రాజకీయాలకు అతీతంగా కృషి దేశానికి అన్నం పెట్టే రైతులు సంతోషంగా ఉండాలనేది నా లక్ష్యం. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని రైతులను రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపై తెచ్చాం. హంద్రీ నీవా కాలువ నీటిని అందించే పైపులైను స్కీమును అమలు చేశాం. ఎంతో కష్టపడ్డాం. ఒకప్పడు ఏటా ఒక పంట పండటమే కష్టంగా ఉంది. నేడు అనేక మంది 2 పంటలు సాగు చేస్తున్నారు. కొందరు మూడు పంటలు కూడా వేసుకుంటున్నారు. తర్వాత మరో 8 పైపులైను స్కీములు ఏర్పాటయ్యాయి. తద్వారా 800 ఎకరాలకు నీటి భద్రత చేకూరింది. రాజకీయాలకు అతీతంగా నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో బాధ్యత పెరిగింది. – సూగూరు వెంకటేశ్వరరెడ్డి (98660 09889), మాజీ బ్యాంకు ఉన్నతాధికారి, రైతు, సర్పంచ్, మల్లెపల్లి, కర్నూలు జిల్లా -
కరోనా కాలం: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై!
పలమనేరు: కోవిడ్ దెబ్బకు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి. పలువురు రైతులు ఇళ్లను వదలి పొలంబాట పడుతున్నారు. ఇన్నాళ్లూ పట్టణాలకే పరిమితమైన వైరస్ ఇప్పుడు పల్లెల్లో విజృంభిస్తోంది. శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా 260 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఊర్లు వదలి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారం నియోజకవర్గంలో 90 పంచాయతీలున్నాయి. సుమారు 70 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. రైతుల్లో చాలామందికి పొలాల వద్ద మోటారు షెడ్లు, పశువుల షెడ్లు, గుడిసెలు, కొందరికి పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. నిత్యం గ్రామాల్లోకి రావడం, జనంతో మాట్లాడడంతో కోవిడ్ వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. దీనికితోడు గ్రామాల్లోనూ ఎక్కువగా మరణాలు సంభవిస్తుండడంతో ఒకింత భయాందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో నెలకు సరిపడా నిత్యావసరాలు తీసుకొని కుటుంబ సమేతంగా పొలాల వద్ద తలదాచుకుంటున్నారు. రెండు రకాలుగా లాభం ఇంటిల్లిపాది పొలం వద్ద ఉండడంతో పొలం పనులు చక్కగా సాగుతున్నాయి. పగటిపూట వ్యవసాయపనులు, పశువులను సంరక్షిచండం చేస్తున్నారు. పాతకాలం నాటి పద్ధతులతో అరటి ఆకుల్లో రాగి ముద్ద, చారు వేసుకుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో అక్కడున్న సౌకర్యాలతోనే సర్దుకుపోతున్నారు. కొందరు పాకల్లో నిద్రిస్తుండగా.. మరికొందరు మోటారు షెడ్లలో సేదతీరుతున్నారు. రెండు,మూడు వారాలుగా గ్రామాల మొఖం చూడడం లేదు. ఖాళీగా కనిపిస్తున్న పల్లెలు రైతులు వారి పొలాల వద్దనే తాత్కాలికంగా కాపురాలు ఉండడంతో పల్లెలు బోసిపోయి కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎవరిని అడిగినా వారు పొలం వద్దే ఉంటున్నారనే సమాధానం వస్తోంది. పొలాల వద్ద సైతం సామాజిక దూరాన్ని పాటించేలా ఒకరిపొలం నుంచి మరొకరి పొలం వద్దకు వెళ్లడం లేదు. ఏదేమైనా కోవిడ్ పల్లె జనానికి కొత్త పాఠాలు నేర్పుతూ పాతతరానికి తీసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. చదవండి: ‘వేవ్’లో కొట్టుకుపోతున్న ఉపాధి పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం -
పల్లెల్లో పట్నం పేదల పాట్లు!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న వారంతా నీళ్లు పడక జ్వరాల పాలవుతున్నారు. చాలామంది కూలీలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు పట్టణాల్లో సరైన ఉపాధి లేక, ఇంటి అద్దెలు కట్టలేక సొంత ఊళ్లో కలో, గంజో తాగి బతుకుదామని గ్రామాలకు చేరుకున్నారు. అయితే, వారిని అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో అది కరోనా అనే ఆం దోళన చెందుతున్నారు. నీళ్లు పడకపోవడంతో సమస్యలు: పట్నాల్లో ఉన్నప్పుడు సురక్షితమైన నీరు అందుబాటులో ఉండడంతోపాటు మినరల్, ఫిల్టర్ వాటర్ వాడి న జనం పల్లెలకు వెళ్లిన తర్వాత అందుబాటులో ఉన్న నీటికి వెంటనే అలవాటు పడలేకపోతున్నారు. దీంతో గొంతు నొప్పి, జలుబు, జ్వరాలు పీడిస్తున్నాయి. గతంలో పండగకో, పబ్బానికో ఊళ్లకు వెళ్లినా మహా అయితే రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండేవారు కాదు. ఆ పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా నెలలు తరబడి ఉండాల్సి వస్తోంది. దీంతో అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలవుతున్నారు. బయటకు చెప్పుకోలేక..: జ్వరం, గొంతునొప్పి లాంటి సమస్యలకు డాక్టర్ల సలహా ప్రకారం ఇంట్లోనే మందులు తీసుకుంటున్నవారు పక్కింటివారికి కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. జ్వరమొచ్చిందని తెలిస్తే ఎక్కడ వెలివేసినట్టు చూస్తారో లేక ఊళ్లో నుంచి వెళ్లిపొమ్మంటారేమోనన్న భయంతో ఇంటి నుంచి బయటకు రాకుండా గడుపుతున్నారు. కరోనా టెస్టులు చేయించుకోడానికి భయపడుతున్నారు. ‘గత పదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నా. రోజూ లేబర్ అడ్డాల వద్ద దాదాపు 20 నుంచి 25 మంది ఉంటాం. అయితే కరోనా తగ్గుతుందేమోనని మూడు నెలలు ఎదురుచూసి ఈ మధ్యే మా సొంత ఊరికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చినంక నీళ్లు, వాతావరణం పడక జ్వరం వచ్చింది. బయటకు ఎళ్లలేక, ఇంట్లనే ఉంటూ మందులు మింగుతున్న’ – మహబూబ్ నగర్‌కు చెందిన మాసన్న మినరల్ వాటర్ మేలు.. పల్లెలకు వెళ్లినప్పుడు కొద్ది రోజులపాటు మినరల్ వాటర్ వాడటం మేలు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ -
అరుపులుండవ్.. మెరుపు దాడులే
అవి సాదాసీదా శునకాలుగానే ఉంటాయి. అంతకుమించి విశ్వాసమూ ప్రదర్శిస్తాయి. అరుపులు వాటికి చేతకావు. అనుమానమొస్తే అమాంతం దాడి చేసి.. ప్రతాపం చూపిస్తాయ్. గ్రామ సింహాల మాదిరిగా కనిపిస్తూ.. చిరుత రాజసాన్ని ప్రదర్శించే పందికోన శునకాలకు చాలా ప్రత్యేకతలున్నాయి. చిరుత పులితో క్రాస్ బ్రీడింగ్ వల్ల కలిగిన సంతానంగా చెప్పే ఈ శునకాలు పోలీస్ శాఖలో నూ సేవలందిస్తున్నాయి. పత్తికొండ: కర్నూలు జిల్లా పందికోన శునకాల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. మూగజీవాలకు రక్షణగా.. పంటలకు కాపలాగా ఉంటూ క్రూర మృగాలను సైతం తరిమేస్తాయి. పౌరుషానికి మారుపేరుగా నిలిచే ఈ శునకాలు పోలీస్ శాఖలో చేరి పలు కేసులను కూడా ఛేదించాయి. పౌరుషం, గాంభీర్యం, వేటాడే తత్వం వీటి సొంతం. పాలెగాళ్ల కాలంలో.. పత్తికొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన గ్రామాన్ని బ్రిటిష్ కాలంలో పాలెగాళ్లు పాలించేవారు. అప్పట్లో భారీ కొండల మధ్య ఉండే దట్టమైన అరణ్యం నుంచి చిరుతలు గ్రామంలోకి వస్తుండేవి. ఆ క్రమంలో గ్రామంలోని సత్రంలో ఓ చిరుత పులి ప్రసవించగా.. దానికి పుట్టిన మగ చిరుత ఆడ కుక్కలతో కలిసి సంచరించేదట. తదనంతర కాలంలో ఆ చిరుత, గ్రామ సింహాల సంపర్కం వల్ల ఆడ శునకాలకు చిరుత లాంటి కుక్క పిల్లలు పుట్టాయని.. ఆ సంతానం వృద్ధి చెంది పందికోన శునకాలుగా పేరొచ్చిందని గ్రామానికి చెందిన రంగప్పరాజు, గువ్వల రంగస్వామి చెప్పారు. దొంగల్ని ఇట్టే పట్టేస్తాయి పశువులు, మేకలు, గొర్రెల మందలకు రక్షణగా గ్రామస్తులు పందికోన శునకాలను వినియోగిస్తున్నారు. మృగాల వాసన పసిగట్టి వాటి బారినుంచి ఈ శునకాలే పశువుల్ని రక్షిస్తాయని, అవసరమైతే మృగాలను వేటాడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్త వ్యక్తులను గుర్తించి నిలువరించడం.. దొంగలను ముట్టడించి దాడి చేయడం వీటి ప్రత్యేకత. ఈ శునకాలు హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇతర దేశాలకూ ఎగుమతి అయ్యాయి. వీటి విశిష్టతను గుర్తించిన అమెరికాకు చెందిన ఓ బృందం 37 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించి వీటికి షెల్టర్, వసతి సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని చెప్పగా.. గ్రామస్తులు నిరాకరించారు. కొన్నేళ్లుగా కేంద్ర రక్షణ శాఖ, పోలీసు అధికారులు వీటిని తీసుకెళ్లి పౌర, రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. వైద్యాధికారులు, కొందరు గృహ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరచూ గ్రామానికి వచ్చి వీటిని తీసుకెళుతుంటారని గ్రామస్తులు తెలిపారు. పేర్లు పెట్టి.. వాతలు వేస్తారు పందికోన గ్రామంలో సుమారు 700 కుటుంబాలు ఉండగా.. 1,500కు పైగా శునకాలను పెంచుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక శునకం కనిపిస్తుంది. కొందరైతే రెండు, మూడింటిని పెంచుతుంటారు. వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆడ కుక్కలకు ఇందిరమ్మ, ఇందిరమ్మబీ, మగ కుక్కలకు రాముడు, భీముడు, రాజు వంటి పేర్లుంటాయి. చిన్న వయసులోనే వీటి దేహంపై రెండు వైపులా వాతలు పెడతారు. రాత్రి వేళ కంటిమీద కునుకు లేకుండా పంట ఉత్పత్తులు, గొర్రెలకు ఇవి కాపలాగా ఉంటాయని గ్రామానికి చెందిన సిద్ధప్ప, బుల్లేని ఆదినారాయణ చెప్పారు. ఈ శునకాలు యజమానులు భుజించే ఆహారాన్నే తింటాయి. పప్పుతో కలిపిన అన్నం ఆరగిస్తాయి. జొన్న రొట్టెలు, చికెన్, మటన్ ఎంతో ప్రీతిగా తింటాయి. పంటల్ని నాశనం చేయడానికొచ్చే అడవి పందుల్ని వేటాడి భుజిస్తాయి. వీటి ప్రత్యేకత తెలుసు గానీ.. పందికోన కుక్కల గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. వీటి ప్రత్యేకతలు తెలుసు. చిరుత పులి, కుక్కల సంపర్కం వల్ల చిరుత లాంటి ఈ శునకాలు జన్మించాయనే ప్రచారం ఉంది. ఇందులో నిజమెంత అనేది చెప్పలేం. వీటికి పౌరుషం ఎక్కువ. మొరగకుండా దొంగల్ని పట్టేస్తాయ్. – లక్ష్మీప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ గొర్రెలకు ఇవే కాపలా నాకు 180 గొర్రెలున్నాయి. ఎప్పుడు అడవి పందులు దాడి చేస్తాయో తెలీదు. అలాంటప్పుడు ఈ కుక్కలే నాకు సహాయంగా ఉంటాయి. నేను భోజనానికి వెళ్తే ఇవే కాపలా ఉంటాయి. కొత్త వ్యక్తులు, దొంగలు, అడవి పందులను దరిదాపుల్లోకి రానివ్వవు. – కోదండ రాముడు, గొర్రెల యజమాని డిస్కవరీ ప్రతినిధులు వస్తుంటారు ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ చానల్ ప్రతినిధులు మా గ్రామానికొచ్చి శునకాలను పరిశీలించి వెళుతుంటారు. వీటి పనితీరును పరిశీలించడానికి ఓసారి అమెరికన్లు మా పొలానికి వచ్చి రాత్రంతా పొలంలోనే ఉన్నారు. అదే సమయంలో అడవి పంది రావడంతో మా కుక్క దానిని వెంటాడి.. వేటాడి చంపేయడం చూసి ఆశ్చర్యపోయారు. – బోయ ఆదినారాయణ, రైతు -
‘ప్రణాళిక’ సరే..పైసలేవి?
బజార్హత్నూర్ మండలం భూతాయి(బి) గ్రామ జనాభా 1200. ఈ లెక్కన పంచాయతీ కి కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి ఏడాదికి రూ.19. 34 లక్షలు రావాలి. మూడు నెలకోసారి నిధులు విడుదల చేసినా రూ.4.83 లక్షలు కేటాయించాలి. అయితే ఈ గ్రామానికి ప్రస్తుతం రూ.1.62 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ నెల 6న గ్రామంలో ప్రారంభించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అనేక సమస్యలు గుర్తించారు.. పిచ్చిమొక్కలు తొలగించడం, గుంతలు మొరంతో పూడ్చడం, డ్రెయినేజీలు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు మాత్రమే ప్రస్తుతం మంజూరైన నిధులు సరిపోయేలా ఉన్నాయి. మరి గుర్తించినటువంటి పెద్ద పనుల పరిస్థితి ఏమిటో?. సాక్షి, ఆదిలాబాద్ : జనాభాలో అత్యధిక ప్రజలు నివసించేది గ్రామీణ ప్రాంతాల్లోనే. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. తలసరి ఒకరికి రూ.806 చొప్పున కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. దానికి అదనంగా తలసరి ఒకరికి రూ.806 చొప్పున జోడించి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ లెక్కన రెండు కలిపి తలసరి ఒకరికి రూ.1612 కేటాయిస్తారు. జనాభా ఆధారంగా ఈ నిధులను జీపీలకు మంజూరు చేస్తారు. జిల్లాలోని గ్రామీణ జనాభా ప్రకారం ఈ రెండు కలిపి ఏడాదికి రూ.87.24 కోట్లు జిల్లాకు కేటాయించాలి. ఈ నిధుల వంతుల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి మంజూరవుతాయి. ఈ లెక్కన జిల్లాకు రూ.21.81 కోట్లు మొదటి విడత మంజూరు కావాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని చెప్పింది. ఇటీవల జిల్లాకు ఈ రెండు నిధులు కలిపి రూ.8.96 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాలేదు. అరకొరగా వచ్చిన నిధులతో ప్రస్తుతం చిన్నపాటి పనులే చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన గ్రామ కార్యాచరణలో భాగంగా ఈ 30 రోజుల్లో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, హరితహారం వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. మిగతా సమస్యలను గుర్తిస్తున్నారు. వాటి పరిష్కారం ఎలా? జీపీలకు మంజూరైన ఈ నిధుల్లో పారిశుధ్యం కోసం 15 శాతం, హరితహారానికి 10 శాతం, విద్యుత్ అవసరాలకు 10 శాతం, కార్యాలయ నిర్వహణకు 5 శాతం, ఇతర ఖర్చులకు 10 శాతం నిధులను కేటాయించినట్లు క్షేత్రస్థాయిలో అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 50 శాతం నిధులను అభివృద్ధి పనులకు కేటాయించాలి. ప్రస్తుతం గ్రామాల్లో గుర్తించిన సమస్యలకు సంబంధించి ఏటా.. ఐదు సంవత్సరాలకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. వార్షిక ప్రణాళికలో ఖర్చు చేయగా మిగిలిన నిధులను వచ్చే వార్షిక ప్రణాళికకు బదిలి చేయాలి. అయితే ప్రస్తుతం కార్యాచరణలో భాగంగా ప్రధానంగా కొత్త గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేవు. వాటి కోసం స్థలాలను గుర్తిస్తున్నారు. ఏదైనా పంచాయతీలో శ్మశానవాటిక లేకపోతే దానికోసం స్థలాలను గుర్తిస్తున్నారు. చెత్త తరలింపు కోసం డంపింగ్ యార్డు స్థలాన్ని కూడా గుర్తిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు భవనం లేకపోతే దానికి కూడా స్థలం గుర్తిస్తున్నారు. ఇలా పలు సమస్యలకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే 50 శాతం నిధులతో ఈ పనులను చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులకు సంబంధించి ఈజీఎస్‌లో చేపడుతున్నారు. తద్వారా వాటికి ఇక ఆ నిధులే శరణ్యం. కొత్త పంచాయతీలకు భవనం కోసం నిధులు పీఆర్ ద్వారా కేటాయిస్తారా?.. ఎలా అన్నది అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక నర్సరీలకు స్థలం కేటాయింపు విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇదిలా ఉంటే హరితహారంలో భాగంగా పంచాయతీలో మొక్కలు నాటుతున్నా వాటి సంరక్షణ కోసం ట్రీగార్డులు కేటాయించకపోగా ముళ్ల కంచెలనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం ఏవిధంగా సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. పలు గ్రామాల్లో ప్రస్తుతం ముళ్ల కంచెలు లభించడం లేదు. దీంతో గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు దాతల వైపు చూస్తున్నారు. అయితే ప్రతీచోట దాతల ఉదారత కనిపించడం లేదు. మరోపక్క విద్యుత్ సమస్యలు ఈ కార్యాచరణలో పరిష్కారానికి నోచుకుంటున్నాయి. అయితే విద్యుత్‌శాఖ ద్వారా పవర్ వీక్ నిర్వహించినప్పుడు పూర్తిసా ్థయి సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన గ్రామపంచాయతీల్లో నెలకొంది. మండలానికో ప్రత్యేకాధికారి ముపై రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో మండలానికో ప్రత్యేక అధికారిని కలెక్టర్ దివ్యదేవరాజన్ నియమించారు. కలెక్టర్ కూడా మావల మండలాన్ని ఎంచుకోవడం గమనార్హం. తద్వారా మిగతా అధికారులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జేసీ సంధ్యారాణి, ఇతర జిల్లా అధికారులు కూడా ఒక్కో మండలానికి ప్రత్యేక అధికారులుగా ఈ కార్యాచరణలో భాగస్వాములు అయ్యారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. -
కోడి గడియారం
ఒక ఊళ్లో ఒక కోడి, దాని పిల్లలు ఉండేవి. అవి రోజూ పగలు, రాత్రి ‘క్కొ.. క్కొ.. క్కొ..’ అని, ‘ట్వియ్ ట్వియ్’ అరుచుకుంటూ ఊరంతా తిరుగుతుండేవి. రానురాను వీటి అరుపులతో ఊరి ప్రజలకు నిద్ర లేకుండా పోయింది. దాంతో అందరూ ఆగ్రహించి.. కోడిని, కోడి పిల్లలను ఊళ్లో నుంచి తరిమేశారు. కోడి తన పిల్లలను తీసుకుని పొరుగూరికి వెళ్లింది. కొత్త వాతావరణం చూసి కోడిపిల్లలు మరింత ఆనందంతో ఇంకా గట్టిగా ‘క్కొ.. క్కొ.. క్కొ.. క్కొ..’ అని అరవడం ప్రారంభించాయి. అవి అలా ఊరంతా తిరుగుతూ ఎడతెరపి లేకుండా అరుస్తుండడంతో ఊరివాళ్లు చికాకుపడి కోడిని, దాని పిల్లలను ఆ ఊరి నుంచి కూడా తరిమేశారు. కోడి మళ్లీ తన పిల్లలను తీసుకుని ఇంకొక ఊరికి వెళ్లింది. అక్కడకూడా వీటి అరుపులు భరించలేక అందరూ తరిమేశారు. ఇలా అన్ని ఊళ్లూ తిరగలేక కోడికి విసుగు వచ్చింది. అడవిలోకి వెళ్లిపోయి, తన పిల్లలతో కలిసి అక్కడే ఉండటం ప్రారంభించింది. ఇక్కడ కోడి, కోడిపిల్లల కూతలు లేకపోవడంతో జనాలకు తెల్లవారుజామునే లేవడం ఆలస్యం అవుతోంది. దాంతో పనులన్నీ ఆలస్యమైపోతున్నాయి. చివరకు అన్ని ఊళ్లలోని జనం కోడిని, దాని పిల్లలను వెతుక్కుంటూ వచ్చి దయచేసి తమ ఊరికి రమ్మంటూ బతిమాలారు. అప్పుడు కోడి ఒక్కొక్క ఊరివారికి ఒక్కొక్క కోడిపిల్లను ఇచ్చి ‘‘దీనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి’’ అని చెప్పింది. కోడిపిల్లలు పెద్దవై కొక్కొరొక్కో అని కూయడంతో ఆయా గ్రామాల ప్రజలు తెల్లవారినట్లు తెలుసుకుని నిద్రలేచి తమ దైనందిన చర్యలలో పడటం అలవాటుగా మార్చుకున్నారు. మంచి చెప్పేవారికి, పదిమందికీ మేలు చేసేవారికి కూడా ఒక్కోసారి కోడికి ఎదురైన అనుభవం ఎదురు కావచ్చు. అంతమాత్రాన నిరాశ పడి ఊరుకోకూడదు. తమ ప్రబోధాలను, తాము చేసే మంచిని కొనసాగిస్తుండాలి. – డి.వి.ఆర్ -
సర్పంచ్‌కే లేదు..మాకెందుకు?
మూసాపేట: సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదు.. మాకెందుకు అంటూ మండల పరిధిలోని తుంకినీపూ గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. వంద శాతం ఓడీఎఫ్ సాధించాలన్న లక్ష్యంతో అధికారులు పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు తుంకినిపూ గ్రామానికి ఎంపీడీఓ నర్సింహారావు, ఈఓఆర్డీ ప్రభాకర్ తదితరులు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడగా.. పలువురు ఎదురుతిరిగారు. సర్పంచ్ ఇంట్లోనే మరుగుదొడ్డి లేదని.. మేమేందుకు కట్టుకోవాలని అడగడంతో అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మమ్మ అధికారుల ముందే గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. ‘నా ఇంటి విషయం మీకెందుకు’ అని అడగడంతో అధికారులు ఎవరికీ సర్దిచెప్పలేకపోయారు. -
మంత్రాలేనంటూ..
నల్లగొండ , చండూరు (మునుగోడు) : అది దళితవాడ. మూడు కుటుంబాలకు చెందిన గుడిసెలు పక్కపక్కనే ఉంటాయి. పదిహేను రోజులుగా ఒక్కరోజు తప్పించి మరోరోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకుంటోంది. అందులో ఉన్న వారు భయంతో పరుగులు తీస్తున్నారు. ఎవరో తమపై మంత్రాలు చేస్తుండడంతోనే ఇలా జరుగుతోందని ఆ కుటుంబాలు వణికిపోతున్నాయి. చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని దళితవాడ మూఢ నమ్మకాలతో వణికిపోతోంది. చివరకు వారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దళితవాడలోని సీత మల్లయ్య, సీత నర్సింహ, సీత రవిలకు చెందిన మూడు పూరిగుడిసెలు పక్కపక్కనే ఉన్నాయి. వీరు రోజువారీ కూలీలు. పొద్దస్తమానం పనిచేయడంతో రాత్రి అలసటతో గుడిసెలో నిద్రిస్తున్నారు. 15 రోజులుగా రోజు తప్పించి రోజు ఆ గుడిసెలకు నిప్పు అంటుకొని కొంతమేరకు కాలిపోతున్నాయి. ముందుగా ఒక గుడిసె నిప్పంటుకొని కొంతకాలిన తర్వాత తిరిగి ఆ పక్కన గుడిసె..ఇదే తరహాలో మూడో గుడిసెకు నిప్పు అంటుకుంటోంది. అయితే విద్యుత్ వైర్ల వల్ల జరుగుతుందా అని అనుకుంటే కాదని తేటతెల్లమైంది. ఆ మూడు ఇళ్ల విద్యుత్ వైర్లు సైతం దూరంగా ఉన్నాయి. షార్ట్‌సర్క్యూట్ కూడా జరిగే అవకాశం లేదు. విచిత్రమైన çఘటనతో అటు గ్రామస్తులు, ఇటు బాధిత కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నాయి. రాత్రి అయితే చాలు గుడిసెలకు దూరంగా చలిలో వణుకుతూ నిద్రిస్తున్నారు. దీనిపై ఆదివారం గ్రామంలో చర్చించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. ఆ రోజు తమకు జరుగుతున్న సంఘటనకు గల కారణాలు తెలియలేకపోతే ఊరి విడిచి వెళ్లిపోతామని బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ.. ఏడాది క్రితం ఓ పూరిగుడిసె ఇదే తరహాలో దగ్ధమై పెద్దమొత్తంలో నష్టం జరిగింది. కొంతకాలం మరిచిన తర్వాత తిరిగి ఇదే సమస్య ఉత్పన్నమైంది. మంత్రాలేనంటూ.. గుడిసె దగ్ధం కావడానికి దగ్గర్లో పొయ్యి లేదు..తోడుగా కరెంటు వైర్లు లేవు. రెండు లేనప్పుడు నిప్పు పుట్టి ఇళ్లు దగ్ధం కావడం ఏమిటని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలతోనే గుడిసెలు దగ్ధం అవుతున్నాయని అంటున్నారు. భయంగా ఉంది ఇంట్లో ఉండాలంటే ఎంతో భయంగా ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఎక్కువైంది. ఆరుబయట పడుకుంటున్నాం. విచిత్రంగా నిప్పు రావడం మాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. – సీత మల్లయ్య, బాధితుడు ఊరు విడిచి వెళ్తాం భయంతో ఊరిలో ఉండలేకపోతున్నాం. మాపై కొంతమంది కక్ష గట్టి మంత్రాలు చేస్తున్నారు. ఆదివారం తర్వాత ఊరివిడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. మా గుడిసెలకు ఎప్పుడు నిప్పు అంటుకుంటుందోనని భయం..భయంగా బతుకుతున్నాం. – సీత రవి, బాధితుడు అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామంలో జరుగుతున్న సంఘటనపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాం. ఎవరూ స్పందించలేదు. భయంతో దళితవాడ వణుకుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సీత యాదయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు -
సర్కార్ బడి సక్సెస్..మూతపడ్డ ప్రైవేట్ స్కూల్స్
-
బాలకృష్ణ డౌన్ డౌన్
♦ రోడ్లకోసం రోడ్డెక్కిన జనం ♦ సమస్యను వినకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణపై ఆగ్రహం ♦ నిరసనగా రాస్తారోకో లేపాక్షి: ‘‘బాలకృష్ణ డౌన్...డౌన్...మా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’’ అంటూ పలు గ్రామాల ప్రజలు నినాదాలు చేశారు. ఇంతకీ ఏంజరిగిందంటే... మండలంలోని సి.వెంకటాపురం, ఓబుళాపురం, గలిబిపల్లి గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో వానా కాలం అడుగుతీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందిగా మారింది. ఈనేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత హిందూపురం వస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు తమ సమస్యలు విన్నవించుకోవాలని ఆయా గ్రామాలప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం ఎమ్మెల్యే లేపాక్షి నుంచి గలిబిపల్లి క్రాస్‌కు రాగానే స్థానికులంతా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్లు లేక నడిచేందుకుకూడా ఇబ్బందిగా మారిందనీ, రోడ్ల సమస్య గురించి అనేక మార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. స్పందించిన బాలకృష్ణ అధికారులతో చర్చించి తగునిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాలకృష్ణ వాహనం బిసలమానేపల్లికి చేరుకోగానే వెంకటాపురం, ఓబుళాపురం, బిసలమానేపల్లి గ్రామ ప్రజలుఅడ్డుకున్నారు. బిసలమానేల్లి నుంచి వెంటాపురం, ఓబుళాపురం గ్రామాలకు రహదారి లేదన్న విషయం చెప్పాలని భావించారు. కానీ బాలకృష్ణ వారితో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే వైఖరిని నిరసనగా రాస్తారోకో చేశారు. ‘‘ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్..డౌన్...ప్రజా సమస్యలు పట్టని పట్టని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’’ అంటూ నినదించారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకూ కదిలేది లేదని రోడ్డుపైనే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రాకపోకలకు స్తంభించాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులకు సర్పిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. -
నమ్మకద్రోహం
► కమిషనరుపై బాధిత గ్రామాల ప్రజల మండిపాటు ► డంపింగ్ యార్డు సమస్య జఠిలం ► రోడ్డుపై బైఠాయించి నిరసన ► మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి రామాపురం(తిరుపతి రూరల్): ‘తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు...సమస్యను పరిష్కారించాల్సింది పోయి బాధిత గ్రామ ప్రజలను రెచ్చగొడుతున్నారు...అధికారులు, ఎంపీ వచ్చి సమస్య పరిష్కరిస్తామని 22 వరకు సమయం తీసుకుని వెళ్లారు...కానీ కమిషనర్, ఎంపీ నమ్మించి మోసం చేశారు... గ్రామస్తుల ప్రమేయం లేకుండా తిరుపతిలో మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్లకు బొమ్మలు చూపించి సమస్య పరిష్కారమైందని ప్రకటిం చడం 14 బాధిత గ్రామాలను మోసగించడమే’నని డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు దుయ్యబట్టారు. తిరుపతి కమిషనర్ హరికిరణ్, ఎంపీ శివప్రసాద్ తీరుపై మండిపడ్డారు. బాధితులను విస్మరించి అఖిలపక్షం మీటింగంటూ మోసగించారని విమర్శలు గుప్పించారు. కమిషనర్ తీరుకు నిరసనగా చెత్త లారీలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్న డంపింగ్‌యార్డు బాధిత గ్రామస్తులకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. గ్రామస్తులతో పాటు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. సాయంత్రం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆందోళన చేస్తున్న ప్రజల వద్దకు వచ్చారు. వారికి మద్దతు ప్రకటించారు. డంపింగ్ యార్డును పరిశీ లించారు. ఎంపీని నమ్మి మోసపోయాం.. గ్రామస్తులు, ఎమ్మెల్యే ఆందోళనతో ఎంపీ డాక్టర్ శివప్రసాద్ రెండు రోజుల క్రితం రామాపురం వచ్చారు. ప్రత్యామ్నాయ స్థలం చూసుకునేందుకు 22 వరకు సమయం ఇవ్వాలని, ఈ నెల 22వ తేదీన వస్తున్న ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని చెవిరెడ్డిని, గ్రామస్తులను ఎంపీ కోరారు. యార్డు తరలించేవరకు ఆందోళన విరమించేది లేదని ఎంపీకి గ్రామస్తులు తేల్చి చెప్పారు. చెవిరెడ్డి చొరవ తీసుకుని, ఎంపీపై నమ్మకం ఉంచుదామని.. గడువు ఇద్దామని గ్రామస్తులను ఒప్పించారు. చెత్త తరలింపునకు అంగీకరించారు. రెండు రోజులకే ఎంపీ మాట మార్చడంపై వారు మండిపడుతున్నారు. కమిషనర్ ప్రకటనను ఎంపీ ఖండించకపోవడంతో ఇద్దరు కలిసి మోసగించారని వారు ఆరోపిస్తున్నారు. కాగా చెత్త తరలిస్తే అంగీరించేది లేదని బాధిత గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. కమిషనర్ తీరుతో జఠిలం.. డంపింగ్ యార్డు సమస్యపై తిరుపతి కమిషనర్ హరికిరణ్ మండలంలోని ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిచి సోమవారం తుడా కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే చెవిరెడ్డి, బాధిత గ్రామలవారిని పిలవలేదు. సమావేశానంతరం ‘చెత్త సమస్య పరిష్క రం అయిందని, చెత్తను తరలించేం దుకు గ్రామస్తులు అంగీకరించారని కమిషనర్ ప్రకటించారు. మీడియాలో కమిషనర్ ప్రకటన చూసిన బాధిత 14 గ్రామాల ప్రజలు మండిపడ్డారు. ఎంపీ అనుమతి లేకుండ కమీషనర్ ఈ ప్రకటనను చేయరని, ఇద్దరు కలిసి బాధిత గ్రామ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీని కమిషనర్ పావుగా వాడుకుని చెత్తను మా నెత్తిన వేస్తున్నారని వాపోయారు. కావాలనే రెచ్చగొడుతున్నారని, సమస్య పరిష్కారం కావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. బాధిత ప్రజలు ఏకమై మంగళవారం రామాపురం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేపట్టారు. చెత్త లారీలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఓ చెత్త ట్రాక్టర్‌లోని చెత్తను రోడ్డుపైనే డంప్ చేయించి పరిశీలించారు. అండగావుంటా.. 14 గ్రామాల ప్రజలకు ఆందోళనకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. రాస్తారోకో, ధర్నాలో ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారితోనే రోడ్డుపైనే బైఠాయించి వారికి భరోసా కల్పిం చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
ఊరూరా రాజన్న స్మరణే..
జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ ఏడవ వర్ధంతి నివాళులర్పించిన కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాక్షిప్రతినిధి, ఖమ్మం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఏడవ వర్ధంతిని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎంతో మంది నిరుపేదలు లబ్ధి పొందారని గుర్తు చేశారు. వర్ధంతి సందర్భంగా రాజన్న అభిమానులు ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంపిణీ చేశారు. నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ధంసలాపురం, అగ్రహారం, కొత్తూరు, ముస్తఫానగర్, పార్శిబంధం, నిజాంపేట, లకారం చెరువు వద్ద, గొల్లగూడెం రోడ్డు, టేకులపల్లి, శ్రీలక్ష్మినగర్, వికలాంగుల కాలనీ, రాపర్తినగర్, గాంధీచౌక్, చర్చికాంపౌండ్ తదితర ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాల వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ముస్తఫానగర్‌లో తుమ్మా అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందడపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లెపల్లి సైదులు, మందడపు వెంకటరామిరెడ్డి, ఆలస్యం సుధాకర్ మాట్లాడుతూ రైతు పక్షపాతిగా, పేద కుటుంబాల్లో పెద్దన్నగా, వృద్ధుల మనుసుల్లో పెద్ద కొడుకుగా నిలబడి.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా వైఎస్ లబ్ధి చేకూర్చారన్నారు. కొత్తూరులో అన్నదానం చేశారు. దమ్మపేట మండలంలో వైఎస్సార్ సీపీ నాయకులు సోయం వీరభద్రం, ముల్కలపల్లి మండలం జనగ్నాథపురం సర్పంచ్ సోయం కృష్ణ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. దమ్మపేటలో పులిహోర పంపిణీ చేశారు. కొత్తగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండేటి ఏసుపాదం ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి, 7 హిల్స్ సెంటర్, కూలీలైన్, బాబుక్యాంప్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాల్వంచలో వైఎస్సార్ సీపీ నాయకులు బస్టాండ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో పాలు, పండ్లు పంపిణీ చేశారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, బూర్గంపాడు మండలాల్లో వైఎస్‌కు నివాళులర్పించారు. మణుగూరు అంబేడ్కర్ సెంటర్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అశ్వాపురం, పినపాక, ఏడూళ్ల బయ్యారం మండలాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు వెంకట్‌రెడ్డి, నేతలు అహ్మద్ హుస్సేన్, ఉడుముల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ మండలం గోళ్లపాడులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెపల్లి సైదులు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పులిహోర, స్వీట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వనమారెడ్డి నాగిరెడ్డి పాల్గొన్నారు. భద్రాచలంలోని మార్కెట్ సెంటర్లో గల వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పిచారు. పట్టణంలోని బ్రెష్ వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కడియం రామాచారి పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. కారేపల్లి సినిమా హాల్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఏన్కూరులో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. ప్రధాన సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుర్సం సత్యనారాయణ పాల్గొన్నారు. ఇల్లెందులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జేకే బస్టాండ్ వద్ద వైఎస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బయ్యారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, జిల్లా నాయకులు ఎండీ.అఫ్సర్, మాజీ కౌన్సిలర్ సంజయ్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధిరలోని వైఎస్సార్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు పులిహోర పంపిణీ చేశారు. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి మల్లు నందిని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి తూమాటి నర్సిరెడ్డి, జిల్లా నాయకుడు అబ్బూరి రామకృష్ణ చౌదరి పాల్గొన్నారు. -
రాజధాని బురద
-
మంత్రి, ఎంపీని తరిమికొట్టిన కోన ప్రజలు
-
జనంలోకి వచ్చిన కృష్ణజింక
-
పోలీసుల పై గ్రామీణుల దాడి
-
నిన్ను చూసి ఓట్లేయలేదు?
పార్టీ విప్ ధిక్కరించిన ఎంపీటీసీని నిలదీసిన ప్రజలు బాపట్ల రూరల్: ‘ఓట్లు వేసి ఎంపీటీసీగా గెలిపిస్తే... నిలువెత్తున ముంచేసి టీడీపీకి ఎందుకు మద్దతు తెలిపావు?.. నిన్ను చూసి ఓట్లువేయలేదని.. జగనన్నను చూసి ఓట్లువేశామంటూ ప్రజలు మండిపడ్డారు.. నీముఖం మాకు చూపించవద్దు’ అంటూ ఈతేరు ఎంపీటీసీ సభ్యురాలు కాగిత నాగభూషణమ్మపై మూడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈతేరులో సోమవారం ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాజన్నపై ఉన్న ప్రేమను ఈతేరు, చుండూరుపల్లి, మర్రిపూడి గ్రామస్తులు మరోసారి చాటుకున్నారు. మొదటి నుంచి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న మర్రిపూడి, చుండూరుపల్లి, ఈతేరు గ్రామాల్లోని ప్రజలు తమ పార్టీ అభ్యర్థినిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి తిరిగి విజయవాడ నుంచి స్వగ్రామానికి వచ్చిన నాగభూషణమ్మను ప్రజలు నిలదీశారు. తన ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానని ఒకసారి, నన్ను అడిగేందుకు మీరెవరంటూ మరోసారి సమాధానం చెప్పడంతో ప్రజలు ఆగ్రహించారు. పార్టీని, ఓట్లు వేసిన గ్రామస్తులను మోసం చేశావంటూ ఎంపీటీసీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఐ మల్లికార్జునరావు, రూరల్, వెదుళ్ళపల్లి ఎస్ఐలు చెన్నకేశవులు, సురేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పారు. -
పల్లె జనానికి ఎక్కిళ్లు..
పాచికల పాడుకు నీటి గండం పట్టుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. నెల రోజులుగా గుక్కెడు నీరందక గ్రామస్తులు అల్లాడుతున్నారు. బోర్లలో నీరు అడుగంటడంతో పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లు, సైకిళ్లలో బిందెలు పెట్టుకుని నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పశువులున్న వారి పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది. పాచికలపాడు (కమలాపురం), న్యూస్‌లైన్: కమలాపురం మండలం పాచికలపాడు గ్రామానికి చెందిన ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన బోరు ఎండిపోవడంతో దాదాపు నెల రోజు లుగా నీరందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమీప గ్రామాలైన గోపులాపురం, చదిపిరాళ్ల తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో, ఎద్దుల బం డ్లల్లో, సైకిళ్లలో బిందెలు కట్టుకుని నీరు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. పశువులున్న వారి పరి స్థితి చాలా ఇబ్బందిగా ఉంది. పశు యజమానులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీను తెచ్చుకోవడానికే సమయం వెచ్చించాల్సి వస్తోంది. రాజకీయ నాయకులు, అధికారులు కనీసం ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రోడ్డు వసతి సరిగా లేకపోవడంతో ఇతర గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాలన్నా కష్టమవుతోందన్నారు. కుందూ నది నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే పైప్‌లైన్ నుంచి వచ్చే నీరు రాకుండా వాల్వ్ బిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ హరీష్‌తో ప్రస్తావించగా తన దృష్టికి రాలేదని, తక్షణం గ్రామానికి వెళ్లి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 9గంటల నుంచి నీరు తెస్తున్నా ఉదయం 9గంటల నుంచి చదిపిరాళ్లకు వెళ్లి నీరు తెస్తున్నా. మధ్యాహ్నం అవుతున్నా ఇంకా సరిపోలేదు. నాకు మూడు ఎనుములున్నాయి. ప్రతి రోజు కనీసం 40బిందెల నీరు కావాలి. చదిపిరాళ్లకు వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే దాదాపు రూ.100పెట్రోల్ అవుతోంది. నాకన్నా ఎక్కువ పశువులున్న వారు చాలా మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? - ఈశ్వర్‌రెడ్డి, పాచికలపాడు నెల నుంచి ఇబ్బందే నీటి కోసం నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజు ఇతర గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ గ్రామాలకే నీరు సరిపోవడం లేదు. మేము వెళ్తే కాదనలేక నీరు ఇస్తున్నారు. అధికారులు స్పందించి మరో బోర్ వేయడమో, ఎర్రగుంట్ల లైన్ నుంచి నీరు అందించడమో చేయాలి. - సుబ్బారెడ్డి, పాచికలపాడు -
గ్రామీణ ప్రజలు, రైతాంగానికి అంకితం: బాబు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం సాధించిన విజయాన్ని గ్రామీణ ప్రజలు, రైతాంగానికి అంకితమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీకి విజయాన్ని అందించిన గ్రామీణ ప్రజలు, రైతాంగానికి, నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీపై వారు చూపిన ఆదరణ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలోని మండల పరిషత్‌లలో 20 శాతం గెలవటం టీడీపీ వెంట అక్కడి ప్రజలు, కార్యకర్తలు ఉన్నారనేందుకు నిదర్శమన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్, తెచ్చామని టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. తమ పార్టీపై దుష్ర్పచారం చేసి లబ్ధి పొందాలని చూసిన వైఎస్సార్సీపీ ఈ ఫలితాలతో ఖంగుతిన్నదన్నారు. -
కరువు దరువు
సాక్షి, ముంబై: ఈ ఏడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ పది జిల్లాల్లో ఇప్పటికీ కరు వు ఛాయలు మాత్రం తొలగిపోవడం లేదు. చాలా గ్రామాలకు ఇంకా ట్యాంకర్లతోనే నీటి సరఫరా జరుగుతోంది. గత సంవత్సరం వర్షాలు అనుకున్నంతమేర వర్షాలు కురవకపోవడంతో మరఠ్వాడాలోని అనేక గ్రామాల్లో వేసవిలో కరువు తాండవించింది. తాగేందుకు నీరు లేక వందలాది గ్రామాల ప్రజలు వలస పోయారు. పశువులకు మేత, నీరు దొరకడం కష్టతరంగా మారింది. అదృష్టవశాత్తూ ఈ ఏడు ఆరంభం నుంచే వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిం చాయి. అయినప్పటికీ ధులే, పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, బుల్డాణ జిల్లాల్లోని అనేక గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిస్తున్నారు. నీటిసరఫరా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 823 గ్రామాలు, 4,320 కుగ్రామాలకు సుమారు 1,042 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇందులో 99 ప్రభుత్వానికి చెందినవి, 943 ప్రైవేటు యజమానులకు చెందిన ట్యాంకర్లు ఉన్నాయి. ఈ ఏడు 30 జిల్లాల్లో వందశాతం కంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జలాశయాల్లోకి దాదాపు 78 శాతం నీరు వచ్చి చేరింది. కొన్ని జిల్లా ల్లో సంతృస్తస్థాయిలో, మరికొన్ని జిల్లాల్లో తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణంగా జూన్ ఒకటి నుంచి సెప్టెం బరు వర కు దాదాపు 159.9 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. అయితే ఈ సారి జూన్ నుంచి ఆగస్టు 31 వరకే 1,226.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి 125 శాతం వర్షపాతం నమోదయిది. షోలాపూర్, సాంగ్లీ, ఔరంగాబాద్, బీడ్ జిల్లాల్లో 76-100 శాతం వర్షం కురిసింది. ఉస్మానాబాద్ జిల్లాలో 51-76 శాతం వర్షం కురిసింది. రాష్ట్రంలో 84 పెద్ద, 224 సాధారణ, 2,156 చిన్న నీటి డ్యాములు ఉన్నా యి. ఇలా మొత్తం 2,464 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవిగాక మరో 16 డ్యాములు ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు, డ్యాములతో కలిపి 37,335 మిలి యన్ ఘనమీటర్ల నీరు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 29,179 మిలియన్ ఘనమీటర్ల నీరు మాత్రమే ఉంది. శాతాలవారీగా చూస్తే 78 శాతం నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో ఈ నిల్వ లు రోజురోజుకూ తుగ్గుముఖం పడుతున్నాయి. దీన్ని బట్టి వచ్చే సంవత్సరం వేసవి కాలంలో కరువు పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొనసాగనున్న దాణాకేంద్రాలు ఇప్పటికీ కరువు పరిస్థితులు తొలగిపోకపోవడంతో 13 తాలుకాల్లోని పశుదాణా కేంద్రాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బారామతి, ఇందాపూర్, దౌండ్, ఫాల్తన్, మన్, ఖటావో, జాట్, అత్పడి, కవాటే మహాకాల్, టాస్‌గావ్, మంగళ్వేదా, పండర్పూర్ తాలుకాల్లో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటి లో 1.75 లక్షల పశువులకు దాణా సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి పెరుగుతుండడంతో ట్యాంకర్ల సంఖ్యనూ పెంచామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చంద్రపూర్, గడ్చిరోలీ జిల్లాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలా ల్లో పూర్తిగా నీరు చేరడం వల్ల రెండో పంట కూడా సాధ్యం కాకపోవచ్చని రైతులు అంటున్నారు. అయితే వర్షాల కారణంగా నష్టపోయిన పత్తిరైతులకు హెక్టారుకు రూ.ఐదువేలు, సోయాబీన్ రైతులకు హెక్టారుకు రూ.ఏడువేల చొప్పున పరిహా రం చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. పంటలు పూర్తిగా కొట్టుకుపోతే మాత్రం రూ.15 వేలు, రూ.20 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇంత తక్కువ నష్టపరిహారం ఇవ్వడమంటే తమను అవమానించడమేనని రైతులు అంటున్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రభుత్వం వ్యవసాయా న్ని అపహాస్యం చే స్తోందని చంద్రపూర్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో ప్రహార్ పేర్కొంది.