అదే రహస్యం | Shreya Saran's secret to fitness | Sakshi
Sakshi News home page

అదే రహస్యం

Published Wed, Nov 26 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

అదే రహస్యం

అదే రహస్యం

 హీరోయిన్‌కి నటన ప్రతిభతోపాటు అందం కూడా చాలా ముఖ్యం. అదే విధంగా మేకప్ అనేది మెరుగులకే. సహజ అందం లేకపోతే ఎంత మందంగా మేకప్ వేసుకున్నా కృత్రిమ శోభే అవుతుంది. అలా సహజ మేను అందాలు మెండుగా కలిగిన నటీమణుల్లో శ్రీయ ఒక్కరని చెప్పడం అతిశయోక్తి కాదు. నటనలో ప్రతిభశాలినే. అందువల్లే నటిగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, ఇప్పటికీ హీరోయిన్‌గానే కొనసాగుతూ ఇనుమడించే అందాలతో తమిళం, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు భాషల్లో ప్రముఖ హీరోలందరితోను కలిసి నటించిన శ్రీయకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. తమిళంలో జయం రవి నటించిన మళై చిత్రంతో కోలీవుడ్‌పై దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత విక్రమ్, విజయ్, విశాల్, ధనూష్ వంటి స్టార్ హీరోల సరసన నటించారు.
 
 అంతేకాదు స్టార్ దర్శకుడు శంకర్ దృష్టినాకర్షించి సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన శివాజీ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేశారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీయ తన భవిష్యత్ చాలా బ్రైట్‌గా ఉంటుం దని ఆశించారు. అయితే ఈమె ఊహించింది జరగలేదు. కారణం స్వయం కృతాపరాధమే నంటారు. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్‌తో నటించిన శ్రీయ ఆ తర్వాత హాస్యనటుడు వడివేలుతో ఇంద్రలోకత్తిల్ నా అళగప్పన్ చిత్రంలో సింగిల్ సాంగ్‌కు ఆడడంతో కెరీర్‌పరంగా ఈ బ్యూటీ పెద్దమూల్యమే చెల్లించుకున్నారు.
 
 ఆ తర్వాత అజిత్‌లాంటి స్టార్ హీరోలతో నటించాల్సిన అవకాశాలు వెనక్కుపోయాయి. దీంతో శ్రీయకు అటు తెలుగులోను, ఇటు తమిళంలోను ఆశించిన విజయాలు లేక అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అలాంటి శ్రీయకు చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ చిత్రం మనంతో మంచి విజయం లభించింది. ప్రస్తుతం వెంకటేశ్ సరసన గోపాల గోపాల అనే మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఒక చిత్రం కూడ లేదు అయినా ఆమె అందం విషయంలో ఏ మాత్రం మార్పులేదు. సౌందర్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు యోగా, నృత్యసాధన, నిత్యం చేస్తుంటానని ఆహార నియమాలు పాటిస్తానని ఇదే తన సౌందర్య రహస్యం అంటున్నారు శ్రీయ.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement