‘కోట్పా’కు మరింత పదును
ధూమపానంపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల స్వీకరణ
గత ఏడాది రూ.1.67 కోట్ల అపరాధ రుసుం వసూలు
ఈ ఏడాది మే 31 నాటికి 64,311 కేసులు నమోదు
బెంగళూరు : ధూమపానంతో పాటు పొగాకు వినియోగ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం మరింత నిఘా పెంచింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ధూమపానం చేయడం కాని, పొగాకు సంబంధ ప్రకటనలు ఇవ్వడం, 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి గుట్కా, సిగరెట్ వంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం తదితర కోట్పా (సిగరెట్ అండ్ అదర్ టుబాకో ప్రాడెక్ట్ యాక్ట్ -2003 - సీఓటీపీఏ) చట్టానికి విరుద్దంగా వ్యవరించేవారిపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఠీఠీఠీ.ఛిౌ్టఞ్చ.జ్చుట జీఛి.జీ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో అందిన ఫిర్యాదుకు చట్టబద్ధత ఉంటుంది. ఈ ఫిర్యాదును రాష్ట్ర హోంశాఖ ద్వారా స్థానిక పోలీసులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారు లకు తెలుస్తుంది.
వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులను విక్రయించేవారిపై, వినియోగించేవారిపై చర్యలు చేపడతారు. కాగా, కోట్పా చట్టాన్ని అనుసరించి 2014లో కర్ణాటక మొత్తం మీద 1,27,163 కేసులు నమోదు కాగా రూ.1.67 కోట్ల మేర అపరాధ రుసుం వసూలైంది. ఈ ఏడాది మే 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 64,311 కేసులు నమోదయ్యాయి. వీటి ద్వారా రూ. 98 లక్షలను జరిమానా రూపంలో అధికారులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఇదిలా ఉండగా కోట్పా చట్టం దుర్వినియోగంలో రాష్ట్రంలో మైసూరు నగరం మొదటి స్థానంలో ఉండగా అటు పై వరుసగా బెంగళూరు, హుబ్లీ-దార్వాడ, మంగళూరు నగరాలు ఉన్నాయి.