
ప్రకటనలతోనే గుర్తింపు
ప్రముఖ హీరోయిన్ స్థాయి కోసం పోరాడుతున్న నటీమణుల్లో తాప్సీ ఒకరు. వాణిజ్య ప్రకటనలతో నట జీవితాన్ని
ప్రముఖ హీరోయిన్ స్థాయి కోసం పోరాడుతున్న నటీమణుల్లో తాప్సీ ఒకరు. వాణిజ్య ప్రకటనలతో నట జీవితాన్ని ప్రారంభించిన ఈ ఉత్తరాది బ్యూటీ సినిమా రంగప్రవేశం చేసి నంబర్‌వన్ హీరోయిన్ అయిపోదామనే కలలుకన్నారు. అయితే ఆమె ఆశించినట్లుగా దక్షిణాది భాషలైన తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా టాప్ హీరోయిన్ కల ఇంకా నెరవేరలేదు. తమిళం, తెలుగు భాషల్లో యువ హీరోలందరి సరసన నటించారు.
అయినా ఎందుకనో తాప్సీ హీరోయిన్‌గా సరైన స్థాయికి చేరుకోలేకపోయారు. ప్రస్తుతం అవకాశాలు కూడా అంతంత మాత్రమే. లారెన్స్‌తో నటించిన కాంచన-2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంపై తాప్సీ చాలాఆశలు పెట్టుకున్నారు. మరో విషయం ఏమిటంటే చిత్రాలపై నమ్మకంపై వాణిజ్య ప్రకటనల్లో నటించకుండా దూరం అయ్యారు. దీంతో పునరాలోచనలో పడ్డ తాప్సీ మళ్లీ వాణిజ్య ప్రకటనల్లో నటించాలనే నిర్ణయానికి వచ్చారట.
అలాంటి తరుణంలో ఒక క్రీమ్ యాడ్‌లో నటించే అవకాశం రావడంతో మరోమాట లేకుండా ఒప్పేసుకున్నారట. ఆమె మాట్లాడుతూ అమ్మాయిలకు అందం అవసరమే అయితే అందుకోసం తానెప్పుడూ క్రీమ్‌లు లాంటి సౌందర్యసాధనాలను వాడలేదు అన్నారు. తనది సహజసిద్ధమైన అందం అని కూడా కాస్త గర్వంతో కూడిన భావాన్ని వ్యక్తం చేశారు. ఇక వాణిజ్య ప్రకటనల్లో నటించడం గురించి తాప్సీ తెలుపుతూ హీరోయిన్లకు వాణిజ్య ప్రకటనల్లో నటించడం అవసరం అన్నారు. వాటి ద్వారానే నిత్యం టీవీల ద్వారా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని అన్నారు.