నా కూతురు చనిపోయేది : కమల్ హాసన్
నటుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని పెంచుతున్నాడు.
చెన్నై: నటుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని పెంచుతున్నాడు. ఇంతకు ముందు ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని విమర్శించిన కమల్ తాజాగా తమిళనాడులో ప్రబలుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేకపోతే తప్పుకోవాలని చురకులంటించాడు.
‘ఒకప్పుడు డెంగీ జ్వరంతో నా కూతురు చనిపోయి ఉండేదని, ఈ జ్వరాలపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే తప్పుకోవాలి’ అంటూ కమల్ ట్వీట్ చేశారు. పాఠశాల డ్రాప్ అవుట్స్‌ను, నీట్ సమస్యను గ్రహించలేకపోవచ్చు కానీ డెంగీ గురించి తెలుసని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతకుముందు అవినీతి ఆరోపణలను ఖండించిన ఏఐఏడీఎంకే నేతలు కమల్‌కి రాజకీయాల్లోకి వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.